ఢిల్లీలో ఎండలతో పాటు తీవ్రమైన వేడిగాలులు అక్కడి ప్రజానీకాన్ని బెంబెలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టి్స్తున్నాయి. తాజాగా.. మొన్నటికి మొన్న ఢిల్లీలోని ముంగేష్ పురిలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఈ క్రమంలో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జనాలతో పాటు జంతువులు, పక్షులు ఎండలకు అలమటిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు ఆవరణలో నివసించే జంతువులు, పక్షులకు తగిన ఆహారం, నీటి సరఫరా తప్పనిసరిగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ ఆదేశించారు.
ఈ క్రమంలో.. ఉడుతలు, పక్షులతో పాటు చిన్న జంతువుల కోసం క్యాంపస్ అంతటా ఆహారం, నీటితో పాత్రలు ఏర్పాటు చేశారు. సీజేఐ చంద్రచూడ్ ప్రాంగణంలో నివసించే జంతువుల ఆరోగ్యంపై నిఘా పెట్టారు. కొన్ని రోజుల క్రితం.. ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు మైదానంలో నడిచి చిన్న జంతువులకు నీరు, ఆహారం ఉంచే ప్రదేశాలను గుర్తించారు. ఈ ప్రదేశాలలో నిరంతరం ఆహారం, నీటి సరఫరా ఉండేలా చూసుకోవాలని కార్మికులను కోరారు.
Read Also: Satyabhama : కాజల్ ‘సత్యభామ’ ఆంధ్ర రైట్స్ దక్కించుకున్న ప్రముఖ బ్యానర్..
తీవ్ర ఎండల కారణంగా పక్షులు, ఉడుతలు ఇబ్బంది పడుతున్నాయి. మనుషులతో పాటు ఇతర జీవుల పట్ల కూడా సుప్రీంకోర్టు శ్రద్ధ వహిస్తుందని ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇవి ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సీజేఐ చంద్రచూడ్ చేసిన అనేక మార్పులలో ఈ తాజా చొరవ కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో ఎండలు, వేడిగాలులు తీవ్రంగా ఉండటంతో కోర్టు నుండి రిపోర్టు చేసే జర్నలిస్టులకు సరైన సీటింగ్, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు సందర్శకుల కోసం ఫెసిలిటేషన్ సెంటర్, వికలాంగుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
మరోవైపు.. నవంబర్‌లో ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులతో కలిసి సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘మిట్టి కేఫ్’ను ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన కేఫ్ పూర్తిగా వికలాంగులతో కూడిన సిబ్బందిచే నిర్వహించబడుతుంది. కేఫ్ నిర్వాహకులు దృష్టి లోపం ఉన్నవారు, సెలబ్రల్ పాల్సీతో బాధపడుతున్న వారు, దివ్యాంగులు ఉన్నారు.
Read Also: TGSRTC: 8వ తరగతి పాస్ అయ్యారా.. అద్భుత అవకాశం కల్పిస్తున్న టీజిఎస్ఆర్టిసి..