అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు.
కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కెనడా పార్లమెంట్లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు చేసుకున్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో మౌనం పాటించినట్లు సమాచారం.
లోక్‌సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదిర్చే బాధ్యతను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థికి సంబంధించి రక్షణ మంత్రి ఇంట్లో బీజేపీ, మిత్రపక్షాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స్పీకర్ పదవిపై చర్చ జరిగింది.
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో ఓ మహిళ సినిమా తరహాలో హత్యకు గురైంది. హత్య అనంతరం నిందితులు ఇంటికి నిప్పంటించి నగలు దోచుకెళ్లి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ చేయగా ఓ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేసినట్లు ఇండిగో తన ప్రకటనలో తెలిపింది.
024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినేట్ భేటీతో పాటు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మొదటి సమావేశం నేడు సాయంత్రం 5 గంటలకు దేశ రాజధానిలో జరగనుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఆర్థిక విధానాలు, కార్యక్రమాలను ప్రస్తావించి, వచ్చే నెలలో ప్రభుత్వం యొక్క పూర్తి బడ్జెట్ 2024-25 ప్రకటనకు వేదికను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సౌదీ అరేబియాలో ఎండ వేడిమి హజ్ యాత్రికులను అతలాకుతలం చేసింది. వేడి కారణంగా హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు మరణించారు. అత్యధిక మరణాలు ఈజిప్ట్‌కు చెందినవే.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన స్నేహితుల్లో ఒకరికి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని తెలిపారు.
16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు 23 ఏళ్ల యువకుడికి కర్ణాటక హైకోర్టు 15 రోజుల బెయిల్ మంజూరు చేసింది. అసలు విషయానికొస్తే.. బాధిత మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. బాధితురాలికి ఇటీవలే 18 ఏళ్లు కూడా నిండాయి. ఈ క్రమంలో.. ఇరువర్గాల కుటుంబాలు వారికి పెళ్లి చేసేందుకు సానుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బిడ్డకు జీవనాధారమైన తండ్రి అని…
తన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన పవన్..పంచాయతీ రాజ్ శాఖ వ్యవహరాలపై ఆరా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ…