గ్రూప్-2 ఖాళీలను 2వేలు, గ్రూప్-3 పోస్టులను 3వేలు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గ్రూప్ ఉద్యోగాల అభ్యర్థులు, నిరుద్యోగ యువత గురువారం ధర్నా చౌక్ వద్ద భారీ నిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వేదిక వద్దకు చేరుకున్న నిరసనకారులు గ్రూప్-1 మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపికను 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దం విరామం తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైనందున, 563 గ్రూప్-ఐ పోస్టుల భర్తీలో ప్రభుత్వం తమకు…
త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని.. ఇంత మంచి చేసినా ఓటమి పాలవడం నమ్మశక్యంగా లేదన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిందని ఆయన అన్నారు. సింగరేణికే గనులు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు కిషన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్త్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపు జరగాలన్నారు. కేంద్ర నిర్ణయం సరికాదు.. రాష్ట్రంలో ఉన్న గనులు… ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలని ఆయన డిమాండ్…
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు.
గృహనిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారథి కీలక కామెంట్లు చేశారు. రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన గృహ నిర్మాణ లబ్దిదారుల జాబితాను మార్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ప్యాకెట్లలో పాములు, ఎలుకలు, మానవుని వేళ్లు వస్తున్నాయి. ఇటీవల ముంబై నివాసి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మానవ వేలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్శిల్ లో పాము కూడా వచ్చింది. ఇక మరో ఆన్ లైన్ ఆర్డర్ లో చనిపోయిన ఎలుక బయటపడింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈరోజు తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు వేశారు.
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు.