CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Minister Kandula Durgesh: నిర్మాతలకు మంత్రి ఆహ్వానం.. స్టూడియోలు నిర్మాణం చేసేందుకు ముందుకు రండి..
చంద్రబాబు తన పర్యటనలో భాగంగా, నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సారి గెలుపొందారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుంచి ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు.