Andhra Pradesh: రేపటి(శుక్రవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. ఉదయం 9 గంటలకల్లా పసుపు చొక్కాలతో వెంకటపాలెం రావాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేశారు. రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత రేపు తొలిసారిగా చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
Read Also: CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు
శుక్రవారం ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలు జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉండనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంతరం డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు. సాధారణ సభ్యుడిగానే వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంగ్ల అక్షరాల ప్రాతిపదిక వరుస క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.