రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. 2023-24 సం.కి గాను 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగింది. 2023-24 సం.కి గాను ఆయిల్ పామ్ సాగు పధకం (NMEO-OP) కింద, కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లను విడుదల చేయడం జరిగింది. దీనికి రూ.53.40 కోట్ల రాష్ట్ర వాటా…
పోడు భూములు రణ రంగాన్ని సృష్టిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొడు రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో కేసీఆర్ కుర్చీ వేసుకొని పొడు భూముల పట్టాలు పంచుతామని చెప్పి, పొడు రైతులను నిండా ముంచారన్నారు. పొడు రైతుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, 30, 40 సంవత్సరాల నుంచి పొడు భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉన్న ఫలంగా భూములు గుంజుకుంటే రైతులు…
విద్యుత్ విచారణ కమిషన్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. విచారణ కమిషన్ కేసిఆర్ పైన అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీ ఆర్ ఎస్ పైన బురద జల్లె ప్రయత్నం చేస్తోందని, కేసీఆర్ పైన, గత ప్రభుత్వం పైన చేసిన అభివృద్ది పై ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల…
సుప్రీంకోర్టులో జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు స్థాపించిన 75వ సంవత్సరంలో ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తోంది. ఈ సమయంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించనున్నారు. సామాన్య ప్రజలు ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. స్థాపన జరిగిన 75వ సంవత్సరంలో.. తగిన పెండింగ్‌లో ఉన్న కేసుల సామరస్య పరిష్కారాన్ని కనుగొనడానికి సుప్రీంకోర్టు 2024 జూలై 29 నుండి 2024 ఆగస్టు 3 వరకు ప్రత్యేక…
కేవలం విద్య మాత్రమే సమాజాన్ని , దేశాన్ని మారుస్తుంది రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య ప్రమాణాలతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనిత మహావిద్యాలయా ఫార్మసీ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయి మాట్లాడారు. నాణ్యమైన విద్య తో…
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో.. వెంటనే అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైందని, ఒకటి రెండు ఏళ్లలో స్థిరమైన మార్పులు కనిపిస్తాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఅర్ కిట్ లో మార్పులు.. ప్రతి 35 కిలోమీటరు కి ఒక ట్రామ సెంటర్, కొత్తగా 75 ట్రమా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డయగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు లింక్ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 3 రకాల టాస్క్ ఫోర్స్ ను…
రీల్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి మహిళ మృతి 23 ఏళ్ల మహిళ కారు డ్రైవింగ్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. మృతురాలు ఛత్రపతి శంభాజీ నగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వసేగా గుర్తించారు. శ్వేత సులి భంజన్ ప్రాంతంలోని దత్ధామ్ ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆమె రీల్ చేయడానికి ప్రయత్నించింది.…
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , కలెక్టర్ పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, సీఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్, వాటర్ సప్లై, సాలిడ్ వాటర్ మేనేజ్మెంట్ తదితర విషయాల సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..…
మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగఅవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ లు నిరుపయోగం మారాయని, ఐటీఐ ల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని, 40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐ…