AP Crime: ఈపురుపాలెంలో మహిళ హత్య.. బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రికి సీఎం ఆదేశం
- సుచరిత అనే మహిళ హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు
- హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితకు ఆదేశం
- ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత అనే మహిళ హత్యకు గురైంది. సుచరిత హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తులో అలసత్వం లేకుండా.. జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపురుపాలెంకు హోంమంత్రి అనిత బయలుదేరారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎం చంద్రబాబును డీజీపీ ద్వారకా తిరుమల రావు కలిశారు. చీరాల మండలం ఈపూరు పాలెంలో మహిళ హత్యోందతాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: AP Assembly Speaker: శాసనసభ స్పీకర్ ఎన్నిక.. అయ్యన్నపాత్రుడు తరపున పవన్, లోకేష్ నామినేషన్
Also Read
అసలేం జరిగిందంటే..
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సుచరిత(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూతురు ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లిన తల్లికి స్థానిక గర్ల్స్ హైస్కూల్ సమీపంలో కుమార్తె సుచరిత మృతదేహం కనిపించింది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. .సుచరిత మృతిని అత్యాచారం, అనంతరం హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఘటన వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ యువతి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!