టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు ఇండియా-అప్ఘనిస్తాన్ మధ్యా సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఇరుజట్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక్కో మార్పు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
జూన్ 21న (రేపు) తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని గుర్తు చేసుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో…
మన రాష్ట్రం సినిమాటోగ్రఫీకి అనేక విధాలుగా తోడ్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కోనసీమ , కృష్ణా పర్యాటక ప్రాంతాల్లో అనేక షూటింగులు జరిగాయని.. గత పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కేరళ నుంచి కోనసీమను అభివృద్ధి చేసేవాళ్లని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
16 ఎంపీలు సాధించిన టీడీపీ వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో చేరి 8 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ , బీజేపీ గెలిచిందని, సింగరేణి బొగ్గు గనులను బహిరంగ మార్కెట్లో రేపు కేంద్రం వేలం వేయబోతుందన్నారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో సింగరేణి బొగ్గు గనుల వేలం ఆపాలని అప్పటి…
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు తీసుకుంటుందని డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ రాసింది. జూలై 2వ తేదీ నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది.
ముఖ్యమైన స్థానాలకు వ్యక్తులను ఎన్నుకునే ముందు ప్రభుత్వం క్షుణ్ణంగా నేపథ్యాన్ని తనిఖీ చేయాలని పేర్కొంటూ, ఇంధన విధానంపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నియమించాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నైతిక, నైతిక , సాంకేతిక కారణాలపై నిష్క్రమించారు. ప్రవీణ్ కుమార్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ , కమిషన్ అందించిన నోటీసుకు ప్రతిపక్ష నాయకుడు , బిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్…
బీసీసీఐ (BCCI) టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024-25 దేశవాళీ సీజన్లో.. భారత క్రికెట్ జట్టు 3 జట్లతో 5 సిరీస్‌లు ఆడనుంది. అందులో రెండు టెస్ట్ సిరీస్‌లు, రెండు టీ20 సిరీస్‌లు, ఒక వన్డే సిరీస్ ఉన్నాయి. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భారత్ లో పర్యటించనున్నాయి. ఇండియా స్వదేశ షెడ్యూల్ సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరీస్ భారత్ ఆడనుంది.…
ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు.
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలు గతి తప్పాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనలో జైలుకు వెళ్లిన యువకులను స్థానిక సబ్ జైల్ లో గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిల వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. కేవలం హిందువులపై కక్ష పూరితంగా అక్రమంగా కేసులు నమోదు చేస్తూ…