Jagadish Reddy : తెలంగాణకు రక్షణ కవచం బీఆర్‌ఎస్ అని మరోసారి తేలింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్‌ఎస్ అని మరోసారి తేలిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడేది కెసిఅర్ అని నిరూపితం అవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ హక్కులు దారాదత్తం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ పట్ల సోయి లేదని, కేఆర్‌ఎంబీ విషయాల్లో కాంగ్రెస్ ఎదురు దాడి చేసి… తప్పించుకునే ప్రయత్నం చేసిందని జగదీష్ రెడ్డి విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రకు కాంగ్రెస్ , బీజేపీ తెర తీసిందని ఆయన మండిపడ్డారు. ముందు బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గనుల వేలంకు అంగీకారంకు వచ్చాయని, అది తెలిసి సింగరేణి బొగ్గు గనుల వేలం ను బీఆర్‌ఎస్ అడ్డుకుంటాం అని చెప్పామన్నారు.
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇప్పుడు బొగ్గు గనుల వేలం విషయంలో వెనక్కి తగ్గారని, కాంగ్రెస్ , బీజేపీలను బొగ్గు గనుల కోసం ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నారని, నిన్న భట్టి విక్రమార్క మాట్లాడిన మాటలకు…ఇవాళ మాటలకు తేడా ఉందని ఆయన అన్నారు. కిషన్ రెడ్డి కి బొకే ఇచ్చారు భట్టి విక్రమార్క.. ఇదేనా భట్టి మీ పోరాటం అని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణిని నట్టేట ముంచి దానికి ఉరి పెట్టే పని చేశాడంటూ కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరి వేయడమేనని జగదీశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!