తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాలు, సేవలను బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం స్మరించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేశారని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చివరి దశకు మార్గనిర్దేశం చేసే శక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని చంద్రశేఖర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ…
ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు.
కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్న… వారి పోరాటాల, త్యాగాల ఫలితం ఈ గెలుపు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు మూడో సారి మోడీ నీ ప్రధాని గా చూడాలని 8 మందిని గెలిపించారు…. తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. రాజకీయ ప్రస్థానాన్ని పార్టీ కార్యాలయం లో ప్రారంభించిన కార్యకర్తలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులు అయ్యారు… వారికి మంత్రి వర్గం లో తీసుకున్నందుకు మోడీ కి…
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ ముందు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముఖ్యంగా.. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్.. ఇంత స్కోరు చేయగలిగింది. 28 బంతుల్లో 53 పరుగులతో చేలరేగాడు. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా (32)…
ఎవరైనా బయట భోజనం చేయాలంటే ఈ రోజుల్లో కాస్త ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే బిర్యానీలో బొద్దింక, ఐస్‌క్రీమ్‌లో జెర్రీ.. ఇలాంటి వార్తలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. తాజాగా తిరుపతిలోని ఓ హోటల్లో తినే భోజనంలో జెర్రీ ప్రత్యక్షమైంది.
వేగంగా పట్టణీకరణ, కూరగాయల సాగుకు అవసరమైన విస్తీర్ణం అందుబాటులో లేకపోవడం, పెరుగుతున్న కూరగాయల ధరలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఉద్యానవన శాఖ జూన్ 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రెడ్‌హిల్స్‌లోని తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘మన ఇల్లు మన కురగాయలు’ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం డాబాపై నాణ్యమైన, పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలను పండించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని పెంపొందించడం , కర్బన ఉద్గారాలను…
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ జూన్ 21న (రేపు) తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే…
ఒకప్పుడు నగరాల్లో మాత్రమే ఉండే వంట గ్యాస్.. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికీ ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఏమీ తినలేం.. అంతేకాకుండా.. సులభంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే.. గ్యాస్ వాడకం ఎక్కువగా ఉండటం వలన, సిలిండర్ ధరలు సామాన్యుడికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. గ్యాస్ వాడకాన్ని కొద్దిగా తగ్గించినప్పటికీ అనుకున్న సమయానికి ముందుగానే అయిపోతుంది. అయితే.. ఈ చిట్కాలు పాటించడం వలన గ్యాస్ తొందరగా అయిపోకుండా చూడొచ్చు.…
రేపటి(శుక్రవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు.