Ponguleti Srinivas Reddy : అధికారులు ఎక్కువ చేస్తే బదిలీలు ఉండవు.. డైరెక్ట్గా రిమూవ్ చేయడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేషన్ కార్డ్ ఏ కాదు ఏదైనా అనర్హులైన వారు వారి అంతట వారే తప్పుకుంటే మంచిదన్నారు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ధనుకులకి కాదు బీదవారి ప్రభుత్వమని, ప్రజలకి అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఎవరైనా అధికారులు ఎక్కువ చేస్తే నా పాలనలో ట్రాన్స్ఫర్లు ఉండవు డైరెక్ట్గా రిమూవ్ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకి ఎంత బాధ ఉంటే మీ మీద కంప్లైంట్ చేస్తారు అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని ఆయన అన్నారు.
ప్రజాసమస్యలు పట్టించుకోలేని వారిని ప్రభుత్వ ఉపేక్షించబోదని హెచ్చరించారు. అధికారులంతా సక్రమంగా పనిచేయాలని, కబ్జాకు గురైన వాటన్నిటిని బయటకు తీసి పేదోడికి అప్పజెప్పాలని ఆయన సూచించారు. ఇకనైనా ప్రతిపక్షాలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని పొంగులేటి తెలిపారు. మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం.. త్వరలోనే రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రూ.31వేల కోట్లతో రైతుల రుణాలను మాఫీ చేయనున్నామని పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!