డయేరియా నివారణ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. డయేరియా కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు రూ.12 లక్షల సాయం ప్రకటించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు డిమాండ్ చేశారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన దళిత బందు కంటే గొప్ప పథకాన్ని ప్రకటించాలి. దళితుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా వారిని సంపన్నులుగా మార్చేందుకు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా…
కరీంనగర్ జిల్లాలోని ఇళ్ళంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఆనతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ కార్యకర్తలు, నాయకులు కష్ట పడి పని చేయడం వల్లె తనకు మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ఇల్లంతకుంట దేవస్థానం నుండి ప్రచారం ప్రారంభించానని, తనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కిందన్నారు. అందుకోసం మళ్ళీ ఈ దేవస్థానంలో స్వామి వారి…
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. రేపు(జూన్ 22న) పులివెందులకు వెళ్లనున్నారు వైఎస్ జగన్.
వానకాలం సీజన్ నుంచి సన్న రకం వరిపంటకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా రైతులు నాట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు . మార్కెట్లో సన్న రకం వరిపంటకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో రైతులు పంటకు దూరంగా ఉంటున్నారు. దాదాపు 20 నుంచి 30 శాతం మంది రైతులు సన్న రకాన్ని సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి మార్పు లేదు. అధిక పెట్టుబడి, తక్కువ దిగుబడి,…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. 'నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం!' అంటూ ట్వీట్ చేశారు.
రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9 2023లోపు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధరపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణతో పాటు విధివిధానాలను కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు అన్న దానిపై నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ప్రభుత్వ…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.
అఖిల పక్షంగా ప్రధానిని కలుస్తాం.. కిషన్ రెడ్డి అవకాశం కల్పించాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిల పక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు 10వ బొగ్గు వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సింగరేణికి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ ప్రకారం సింగరేణి కి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మల్లు…
అమరావతి మాస్టర్ ప్లాన్‌పై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్‌తోనే ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై పూర్తిగా స్టడీ చేసి ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని.. ఆ దిశగా నివేదిక రెడీ చేసి ప్రజల అభిప్రాయంతో నిర్మాణం చేపడతామన్నారు.