Chamala Kiran Kumar Reddy : బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో పెండింగులో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద 31 అంశాలు పెండింగులో ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో అనేక శాఖలకు సంబంధించినవి ఉన్నాయని, రెసిడెంట్ కమిషనర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నానని ఆయన తెలిపారు. పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు కేంద్రాన్ని కలిసి మాట్లాడారని, మేం కూడా మా వంతుగా ఈ పెండింగ్ అంశాలపై కేంద్రంతో చర్చిస్తామన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. పెండింగ్ అంశాలపై రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల సభ్యులు కలిసి పనిచేయాలని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో పెండింగులో ఉందన్నారు ఆయన. విభజన హామీల్లో ఇది మొట్టమొదటిది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని, సైనిక్ స్కూల్ వ్యవహారం కూడా ఇంకా పెండింగులోనే ఉందన్నారు. నేషనల్ డిజైన్ సెంటర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, 2019 నుంచి ఈ అంశం పెండింగులో ఉందన్నారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.
అంతేకాకుండా..’ఉమ్మడి సంస్థల విభజన అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఇంకా పెండింగులో ఉంది. ఇప్పుడు ఈ శాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. స్మార్ట్ సిటీస్.. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరాలైన వరంగల్, కరీంనగర్‌ను స్మార్ట్ సిటీస్ చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ స్పందనలో ఇబ్బంది లేదు. సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ ఆచరణలో అమల్లోకి తేవాలి. వెనుకబడి జిల్లాల అభివృద్ధికి ఇచ్చే నిధులు కూడా పెండింగులో ఉన్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశం కూడా ఇంకా నెరవేరలేదు. సెక్షన్ 11(ఏ) ఎంఎండీఆర్ యాక్ట్ ప్రకారం సింగరేణి బ్లాకులను ఆ సంస్థకే వదిలిపెట్టాలి. వాటిని వేలం వేయడానికి వీల్లేదు. తెలంగాణకు సింగరేణి ఒక లైఫ్ లైన్. కానీ వేలం వేయడం ద్వారా దాన్ని చంపేస్తున్నట్టే అవుతుంది. కిషన్ రెడ్డి ఈ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఈ అంశాన్ని అడ్రస్ చేయాలి. ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేసి రద్దు చేశారు. దాన్ని తెలంగాణకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోసం ప్రతిపాదనలు పంపించాం. 18వ లోక్‌సభలోనైనా తెలంగాణకు అన్యాయం జరగొద్దు అన్నదే మా ఆలోచన. ప్రధాని మోడీ తెలంగాణను కూడా గుజరాత్ అనుకోవాలి. బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగులో కాంగ్రెస్‌ను దూషించడంతోనే సరిపెట్టారు తప్ప 8 మంది ఎంపీలను ఇచ్చిన తెలంగాణకు ఏం చేస్తామో చెప్పలేకపోయారు. దక్షిణ భారతదేశం నుంచే జీఎస్టీకి అత్యధిక వసూళ్లు జరుగుతున్నాయి. అందులో తెలంగాణ అత్యధికంగా అందజేస్తోంది. కానీ రాష్ట్రాల వాటా తిరిగి పొందే విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా మా ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తుందో మీకు తెలుసు. కేంద్రంతో పెండింగ్ అంశాల గురించి తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.’ అని ఎంపీ కిరణ్ కుమా రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
తాజావార్తలు
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!