Minister Narayana: గుంటూరు కార్పొరేషన్‌లో సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నగరంలో పారిశుధ్యం, శివారు ప్రాంతాల్లో తాగు నీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మొండిగటం డ్రైన్, అగత్తవరప్పాడు డ్రైన్‌లు పొంగడం, కల్వర్టుల కింద పూడిక తీత అంశాలపైనా చర్చలు జరిపారు.
Read Also: Andhra Pradesh: ఏపీ సీఎంవో చీఫ్ సెక్యూరిటీ అధికారిగా డీఎస్పీ యశ్వంత్ నియామకం
గుంటూరు తూర్పు నియోజక వర్గంలో చెత్తను మాన్యువల్‌గానూ, పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఆటోల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ కీర్తికి మంత్రి నారాయణ సూచించారు. నగరంలో ఉన్న ఆర్ అండ్ బీ రోడ్ల గుంతలను కార్పొరేషన్ వారు మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మంత్రి నారాయణ ఫోన్‌లో మాట్లాడారు.