Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 16 07 2024

Top Headlines @9PM : టాప్ న్యూస్

Published Date :July 16, 2024 , 9:08 pm
By Gogikar Sai Krishna
Top Headlines @9PM : టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. వెలగపూడి నుండి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసి అవకాశం ఉంది. విభజన సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అమిత్‌షాను కోరనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. రాత్రికి సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే బస చేయనున్నారు. చంద్రబాబు ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. పదిహేను రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి.

తీహార్‌ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో వంద రోజులకు పైగా తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు వెంటనే దీన్‌దయాల్ ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజుల నుంచి కవిత అధిక జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం నీరసంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. తీహార్ జైలు వైద్యుల సూచనమేరకు దీన్ దయాళ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.కవిత ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరిగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 4 నెలలగా జైలులో ఉన్నారు. కవితపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి.

ప్రోటోకాల్ గురించి కేటీఆర్.. హరీష్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

ప్రోటోకాల్ గురించి కేటీఆర్.. హరీష్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన ముందు కేటీఆర్.. హరీష్ ల అనుభవం చాలా చిన్నది.. వాళ్ల వయస్సు చిన్నదని, ఎంపీ గా రేవంత్ ఉన్నప్పుడు ఆయన నియోజక వర్గంలో ప్రోటోకాల్ పాటించారా కేటీఆర్.. హరీష్ ఎప్పుడైనా..? అని ఆయన ప్రశ్నించారు. మీరు ప్రోటోకాల్ పాటించకుండా.. ఇప్పుడు సిఎం రేవంత్ నీ ప్రోటోకాల్ గురించి అడగడంలో అర్థం లేదని, సంగారెడ్డి లో గెలిచిన నన్ను పక్కన పెట్టీ ఓడిపోయిన వ్యక్తితో శంకుస్థాపనలు చేయించలేదా హరీష్ అని ఆయన అన్నారు. అప్పుడేమో చిలిపి చేష్టలు.. ఇప్పుడేమో వగలాడి మాటలు అని జగ్గారెడ్డి అన్నారు. ప్రోటోకాల్ విషయంలో కేటీఆర్ హరీష్ నాలుగు రోజులు ఒకసారి కాంగ్రెస్‌పై నిందలు వేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రుల పైన ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ పాలన ముందు కేటీఆర్ హరీష్ ల అనుభవం చాలా చిన్నది.. వాళ్ల వయస్సు చాలా చిన్నదన్నారు జగ్గా రెడ్డి అన్నారు.

రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేత.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో నిమ్మచెట్ల నరికివేతను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. మంజుల అనే మహిళా రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేతపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షింది లేదన్నారు. రౌడీ రాజకీయాలకు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.

రైతులకు అలర్ట్‌.. ఈ నెల 18న రూ. లక్ష వరకు రైతు రుణమాఫీ

పంట రుణాల మాఫీకి రైతులకు రేషన్ కార్డు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన మరుసటి రోజు, రూ.2 లక్షల పంట రుణమాఫీని అమలు చేయడానికి భూ పాస్‌బుక్ ఉపయోగించబడుతుంది అని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. రైతులకు పథకం. సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమైన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు ఉపయోగించబడుతుంది. చాలా మందికి రేషన్‌కార్డులు లేకపోవడంతో రేషన్‌కార్డును తప్పనిసరి చేస్తే చాలా మంది రైతులు మాఫీని కోల్పోతారని వివిధ వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వివరణ ఇచ్చారు. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూలై 18న సాయంత్రంలోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడిచింది.

ఇంట్లోకి దూరి చంపుతాం’’ అని మోడీ చెప్పారు.. మరి ఇదేంటి..?

జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో రెచ్చిపోతున్నారు. తాజాగా జరిగిన దోడా ఉగ్రఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. దీనిపై ప్రతిపక్షాలు బీజేపీపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోడీని టార్గెట్‌గా ప్రశ్నించారు. ‘‘ఘర్ మే ఘుస్ కర్ మారేంగే’’ ఉగ్రవాదుల్ని ఇంట్లోకి దూరి చంపేస్తాం అని ప్రధాని మోడీ చెప్పారని, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరిగేంటని ప్రశ్నించారు.

వరసగా జరుగుతున్న ఉగ్రఘటనలు ప్రభుత్వం వైఫల్యానికి అద్దం పడుతున్నాయని కేంద్రంపై ఓవైసీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని అదుపు చేయలేకపోతున్నారు, దోడాలో జరిగిన ఘటన చాలా ప్రమాదకమైందని ఓవైసీ అన్నారు. సోమవారం సాయంత్రం దోడాలోని దేసా ఫారెస్ట్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో కెప్టెన్ బ్రిజేష్ థాపా, జవాన్లు రాజేష్, బిజేంద్ర, అజయ్‌లు మరణించారు.

ఇద్దరు లేదా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ పథకాలు కట్.. త్వరలో చట్టం..

జనాభా నియంత్రణ చట్టానికి సంబంధించి రాజస్థాన్ మంత్రి జబర్ సింగ్ ఖర్రా వివాదాస్పద ప్రకటన చేశారు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు కాదని పేర్కొన్నారు. ఆదివారం పాలిలో పర్యటించిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వనరులు తగ్గుతూనే జనాభా పెరుగుతోంది, వివిధ సమస్యలకు దారి తీస్తోందని అన్నారు. కాబట్టి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ ఉన్న దంపతులు లేదా కుటుంబాలు ఏ ప్రభుత్వాన్ని అందుకోకుండా చూసేందుకు భారత ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన చట్టం త్వరలో దేశంలో వస్తుందని చెప్పడం గమనార్హం.

ఏపీ సీఎంవో చీఫ్ సెక్యూరిటీ అధికారిగా డీఎస్పీ యశ్వంత్ నియామకం

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్‌ను ప్రభుత్వం నియమించింది. సార్వత్రిక ఎన్నికల ముందు జమ్మలమడుగు డీఎస్పీగా యశ్వంత్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు నిక్కచ్చిగా జరిపారని యశ్వంత్ పేరు పొందారు. నిజాయితీగా విధులు నిర్వహించడంతో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీం కోర్టు తీర్పుపై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండు

సుప్రీం కోర్టు తీర్పు పై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. టెక్నీకల్ పాయింట్స్ పై నే జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయమన్నదని, బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు మధుయాష్కీ. తప్పు చేయకుంటే విచారణ కమిషన్ ముందు హాజరుకావొచ్చుగా అని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేయనప్పుడు ఎందుకు కల్వకుంట్ల కుటుంబంలో కలవరం అని ఆయన ప్రశ్నించారు. పది ఏండ్లలో 80 వేల కోట్ల అవినీతి చేశారని, గతంలోనే విద్యుత్ కొనుగోలు లో అవినీతి జరిగిందని చెప్పిన అని మధు యాష్కీ గుర్తు చేశారు. 138 కోట్లు కమిషన్ కేటీఆర్,హరీష్ రావులు తీసుకున్నారని చెప్పారన్నారు. తెలంగాణ రాకముందు మీ ఆస్తుల ఎంత అని, వచ్చాక ఆస్తులు ఎంత అని ఆయన అన్నారు. అన్ని బయటకు వచ్చి జైలుకు పోతారన్నారు. అభివృద్ధి పేరు పైన ,ప్రాజెక్టుల రి డిజైన్ పేరు మీద వేలాది కోట్లు దోచుకున్నారని, విచారణ ను అడ్డుకోవాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. సుప్రీం కోర్టు కేసీఆర్ అవినీతిని అడ్డుకోలేదన్నారు మధు యాష్కీ. కొత్త జడ్జి వచ్చి అవినీతిని బయటకు తీస్తాడని, గ్రీన్ ఛాలెంజ్ అని హడావిడి చేసే చెట్ల సంతోష్ పత్తా లేకుండా పోయిండన్నారు. వాళ్ళ ఆవిడా పేరుమీద నర్సరీ పెట్టి కోట్ల రూపాలను దోచుకున్నారని, దానిపై కూడా విచారణ చేపట్టాలన్నారు మధు యాష్కీ.

హైదరాబాద్ నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి

కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగర శాంతిభద్రతల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలను పునరుద్దరించాలని, బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి.. క్రిమినల్స్ తో కాదన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. డ్రంకన్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలని, హైదరాబాద్ నగరంలో రాత్రి పూట ఫుడ్ కోర్ట్ ల విషయంలో ఇబ్బంది రానివ్వొద్దన్నారు. డ్రగ్స్ నియంత్రణ పైన పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలని, డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని, ఎవరో చెబితే కలెక్టర్లు,ఎస్పీలకు పోస్టింగ్ లు ఇవ్వలేదు…సమర్థత ఆధారంగా నిర్ణయం తీసుకున్నారని, కలెక్టర్లు తప్పని సరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనన్నారు సీఎం రేవంత్‌. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలని, రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు. రుణమాఫీ అమలు పైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrabbau
  • CM Revanth Reddy
  • telugu news
  • Top Headlines 9pm
  • Top News

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Fake Holi Links: హోలీ పేరుతో లింక్స్.. ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • Varanasi : స్పిరిట్, రామాయణ రిలీజ్ ప్లానింగ్‌పై రాజమౌళి అసంతృప్తి

  • Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..

  • CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions