తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే.. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దతో మాట్లాడుతూ.. బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రియాక్షన్‌పై భట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నిన్న ఎందుకు సభకు రాలేదని ప్రశ్నించారు. ఇంతే హడావుడిగా వెళ్లి కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదు..? అని, కేంద్ర ప్రభుత్వం చెబితే హడావుడిగా వచ్చారన్నారు. వారు చెబితేనే వెళ్లి హడావుడిగా మా మీద మాట్లాడారని, వారు…
గత కొన్ని రోజులుగా దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. టమోటా, ఉల్లి, బంగాళదుంప వంటి నిత్యావసర కూరగాయల రిటైల్ ధరలు.. 15 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి. అందుకు కారణం వర్షం ప్రభావంతో పాటు.. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న రోజుల్లో ధరలు అదుపులోకి రానున్నాయని తెలిపింది. అయితే కూరగాయల ధరలు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి?…
రాష్ట్ర బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని, గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో… కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమిని ఆయన విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క గారు… మీరు చదివింది ఆర్థిక బడ్జెట్టా…
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్‌కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రమాద ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. మొత్తం 2,400 రికార్డులు కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సగం వరకు కాలిపోయిన 700 రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న పెద్దిరెడ్డి అనుచరుడు మాధవ్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 13.70 అడుగులకు వరద నీటి మట్టం తగ్గింది. బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.