Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..
- కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపాటు
- కేసీఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jupalli Krishna Rao: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. నిన్న బడ్జెట్ మీద పదేళ్లు అనుభవం ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బడ్జెట్ విషయంలో చీల్చి చెండాడుతాం అన్నారని.. అలాంటి కేసీఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదని విమర్శించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటి సారి బడ్జెట్ పెట్టినా.. మీలాగా గ్యాస్…స్ట్రాష్ బడ్జెట్ పెట్టలేదంటూ పేర్కొన్నారు. పదేళ్లు ఆదాయానికి మించి ఖర్చు చేస్తామని.. కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ తెలిపారు. మోసం చేయకుండా.. వాస్తవాలకు దగ్గరగా ఎంత వస్తే అంతే ఖర్చు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులను నట్టేట ముంచుతున్నామని కేసీఆర్ మాట్లాడుతున్నారని.. రైతు బంధు ఎత్తివేయలేదు కదా అంటూ మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన దానికి ఎక్కడా తగ్గించలేదన్నారు. రైతులకు 31వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం.. ఎలా నట్టేట ముంచినట్లు అవుతుందని ప్రశ్నించారు.
Read Also: SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
రైతు బీమా కొనసాగిస్తున్నామని.. పంట బీమా కొత్తగా తీసుకువస్తున్నామన్నారు. క్వింటాల్‌కు రూ.500 రూపాయలు బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. కేసీఆర్ తల తోక లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని.. ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీష్ రావు పరిస్థితి ఉందన్నారు. మేము తెచ్చిన అప్పుల కన్నా.. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎక్కువగా తీర్చుతున్నామని మంత్రి అన్నారు. అసెంబ్లీకి ఎందుకు రావు.. అసెంబ్లీ అంటే అంత చిన్న చూపా అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, అంబేడ్కర్ గురించి మాట్లాడుతున్నారు.. అగౌరవపరిచింది మీరే అంటూ మంత్రి విమర్శలు గుప్పించారు.
బడ్జెట్‌లో 17శాతం కేసీఆర్ చేసిన అప్పులకే సరిపోతుందని అన్నారు. నెలకు 4-5 వేల కోట్లు అప్పుల వడ్డీలకు సరిపోతుందన్నారు. కేసీఆర్ తుగ్లక్ పాలన కాకుండా బాగా పరిపాలన చేసి ఉంటే.. తెలంగాణ అభివృద్ధిలో ఎక్కడో ఉంటుండే అంటూ మంత్రి అన్నారు.
ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం మోపలేదన్నారు. అయినా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీలాగా అడ్డగోలుగా దోచుకునే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. 7వ గ్యారంటీ ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారని.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!