ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యనమల రామకృష్ణుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ లాబీలో విడివిడిగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. జగన్కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలని, ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలన్నారు.…
బెంగళూరు-హైదరాబాద్ హైవేను 4 లేన్ల నుంచి 12 లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో కర్నూలు, అనంతపురం సహా నగరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. NH 44 వద్ద ఈ ప్రధాన అభివృద్ధి ఈ నగరాలను పెద్ద నగరాలు , మార్కర్లకు కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, మెరుగైన మౌలిక సదుపాయాలు పెద్ద పెట్టుబడులకు, మెరుగైన…
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు కాల్చివేత ఘటనకు సంబంధించి నాలుగో రోజునా విచారణ ముమ్మరంగా సాగింది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పి సిసోడియా మూడు జిల్లాల కలెక్టర్ల, ఆర్డీవోలు, తాసిల్దారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనేకమంది వైకాపా బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమ బాధలు వెలగక్కారు. దీంతోపాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ కేసు పురోగతిపై జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహించారు… Kanwar Yatra: యాత్ర శాంతియుతంగా…
నేడు కార్గిల్లో వీర అమరవీరులకు ప్రధాని నివాళి.. ఎత్తైన సొరంగం నిర్మాణానికి శంకుస్థాపన..! 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్లోపర్యటించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు నివాళులర్పించనున్నారు. నేటి ఉదయం 9:20 గంటలకు కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు మోడీ నివాళులర్పిస్తారు. అంతేకాకుండా షింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. అయితే, ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ (ఎక్స్ )…
నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం టిడ్కో గృహాల అంశంపై లఘు చర్చ జరుగనుంది. ఆర్థిక పరిస్థితిపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ముఖ్యంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం మొత్తంగా…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మొదటిసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు సాయంత్రంతో ముగియనుండటంతో ఆయన సాయంత్రం ఢిల్లీకి పయమనమవుతారు. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం 5గంటలకు చంద్రబాబు ఢిల్లీకి బయలు దేరుతారు. . సాయంత్రం 5.10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు.. రాత్రి 7.30గంటలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకుంటారు. రాత్రి 8గంటలకు వన్ జన్ పథ్ రోడ్డుకు…
బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు, విలువైన వస్తువులు లాక్కొని మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానితుడు, సాహిల్ ఖాన్ అలియాస్ మహ్మద్ అఫ్సరుద్దీన్ 2018 లో మహిళతో స్నేహం చేసి, ఆమెతో సంబంధాన్ని పెంచుకున్నాడు. ఓ సమావేశంలో సాహిల్ ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. “సాహిల్ మరో ఇద్దరు మజిద్ మరియు అబూ ద్వారా మహిళ నుండి రూ. 4…
సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వుండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. సర్వీసుల్లో వికలాంగుల కోటా పై తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ స్పందించారు. దివ్యాంగుల పై స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్న మంత్రి.. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, పర్యవసనాలను ఆలోచించకుండా…
అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్లో ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ఏమీ కనిపించలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందని, ప్రతి సంవత్సరం రైతులకు సీజన్ ముందు ఇవ్వాల్సిన పంటపెట్టుబడి సాయం(రైతు బంధు/రైతు భరోసా)కు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. బడ్జెట్ మొత్తంలో ఆసరా పెన్షన్ల ప్రస్తావనే లేదు. పెన్షన్లు పెంచుతామని మోసం చేశారని, మహిళలకు…
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్లు అవసరం. అంతేకాదు.. మంచి డైట్ కూడా పాటించాలి. శరీరంలో కణాలు.. కండరాలను నిర్మించడంలో ప్రొటీన్లు సహాయపడుతుంది. ప్రొటీన్లు.. దంతాల నుంచి మొదలుపెడితే గోర్లు వరకు అవసరం. ప్రొటీన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.. అంతేకాకుండా.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన ఆహారంలో ప్రొటీన్లు అవసరం. అయితే.. మాంసం, గుడ్లు, చేపల్లో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే నాన్ వెజ్ తిననివారి కోసం…