జూలై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు పల్లెకెలెలో జరగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జెర్సీలో భారీ మార్పు జరిగింది. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న టీమిండియా.. నెట్స్ ప్రాక్టీస్‌లో దూకుడు పెంచారు. సూర్యకుమార్ యాదవ్ బృందం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు.
రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు జరిగిన అన్యాయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ “అబద్ధాల పుట్టా” అని ఆమె వ్యాఖ్యానించారు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలేవి..? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు..ఆ సంగతేంది..? అని ఆమె అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి.. మరి వాటి ప్రతిపాదనలేవి..? నిధులెక్కడ..?…
ఊహల బడ్జెట్ కేసీఆర్ ది… వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్ ది అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆలోచన అప్పుల మీద.. రేవంత్…భట్టి లది అభివృద్ధి ఆలోచన అని అన్నారు. వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుందని, 10 వేల కోట్లతో హైద్రాబాద్ దశ మారుతుంది… కేసీఆర్ కి ఎందుకు కుళ్ళు అని ఆయన మండిపడ్డారు. చీల్చుడు లో మేమే…
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త డిజైన్‌తో కర్వ్ ఈవీని రూపొందించింది. టాటా కర్వ్ ఎలక్ట్రికల్ వెహికల్ (EV)ను వచ్చే నెల (ఆగస్ట్ 7)న విడుదల చేయనున్నారు. ఈ కారు ఇంటీరియర్.. కొత్త ఎలక్ట్రిక్ కూపే SUV దాని అండర్‌పిన్నింగ్‌లను నెక్సాన్‌తో పంచుకుంటుంది. ఇంటీరియర్ దాని సబ్‌కాంపాక్ట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి.
తెలంగాణ వైద్య మండలి మరోసారి నకిలీ వైద్యుల భరతం పట్టింది. బుధవారం నాడు హైదరాబాద్ మహానగరం లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కిన్, లేజర్ , కాస్మెటలజీ సెంటర్స్ పైన ఏక కాలంలో 5 బృందలుగా ఏర్పడి జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాధపూర్ , హైటెక్ సిటీ, కూకట్ పల్లి , మియాపూర్ ప్రాంతా ల్లో మొత్తం 40 సెంటర్స్ పై తనిఖీ నిర్వహించారు. ఇందులో ముగ్గురు నకిలీ వైద్యులను గుర్తించి FIR ఫైల్ చేయనున్నట్లు , మరో…
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ 2024-25ను పౌర సరఫరాలు , నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ఆయన పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కొనే ముఖ్యమైన బడ్జెట్ కేటాయింపులు , చక్కటి ప్రాజెక్టులు హైదరాబాద్ వాసుల జీవన నాణ్యతను పెంపొందించడానికి , ఆర్థిక , సాంస్కృతిక కేంద్రంగా దాని స్థానాన్ని పటిష్టం చేయడానికి…
పశ్చిమ ఆస్ట్రేలియాలో గురువారం రెండు హెలికాప్టర్ల ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయన్న సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రెండు హెలికాప్టర్లలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆత్మ స్తుతి పర నింద లా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరు గ్యారంటీ లు నీరు గారిపోయాయని, అంకెల గారడీల రాష్ట్ర బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల ముందు గ్యారంటీలా గారడి అని, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో బడ్జెట్ ఉందన్నారు హరీష్ రావు. ఇచ్చిన హామీల ప్రస్తావన ఏ ఒక్కటి లేదని, అప్పులు తెస్తామని మళ్ళీ చెప్తుందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో మర్చిపోయిందని, 2,500…
బీఆర్ఎస్ నాయకులు మా జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల ఇచ్చారో చెప్పి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 టీఎంసీల కోసం తీసుకున్న ప్రణాళిక అమలు కాలేదని, రెండు టీఎంసీల రాలేదు రెండు వేల కోట్లతో మూడో టిఎంసి అన్నారని, వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయి. కానీ మేము కడితేనె వస్తున్నాయి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.…
ఈ సంవత్సరం కనీసం 2,694 విమానాలకు సంబంధించిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల కారణంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 697 మంది చనిపోయారు. ASN ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు.. భద్రతా సమస్యలపై సమాచారాన్ని అందజేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న మలేషియా నౌకాదళానికి చెందిన రెండు విమానాలు (యూరోకాప్టర్ AS 555SN ఫెన్నెక్ M502-6 మరియు అగస్టావెస్ట్‌ల్యాండ్ AW139 M503-3) ప్రమాదానికి గురయ్యాయి.