టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్లో కలకలం రేపుతోంది. అన్నమీద కోపంతో ఓ తమ్ముడు.. వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కిరాతకంగా నరికి చంపిన ఘటన పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
నేడు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పోలవరం విషయంలో కీలక చర్చ జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయాఫ్రం వాల్ స్థితిగతులపై కేబినెట్లో కీలక సమీక్ష జరగనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు అసెంబ్లీలో గత 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కేంద్ర బడ్జెట్‌పై తీర్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని, గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని, మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీ వెళ్లామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాగ్వాదాల నడుమ నడిచింది. కేంద్రాని ప్రశ్నించేందుకు ఎందుకు కలిసి రారు అని బీఆర్ఎస్ను కాంగ్రెస్ టార్గెట్ చేయగా.. కేసీఆర్‌పై కోపంతో రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంటూ బీఆర్ఎస్ శ్రేణులు వాదనలు చేశారు. అయితే.. చివరగా.. కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు తీవ్రం అన్యాయం జరిగిందనే అభిప్రాయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ అంటే మొదటి నుంచి ప్రధాని మోడీకి చిన్నచూపు అని…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతు్న్నాయి. బీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య చర్చలు హీటును పుట్టించాయి. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పలేదని, మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మని చెప్పండని, నేను కూడా దీక్షలో కూర్చుంటానని ఆయన సవాల్ విసిరారు. ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దామని సీఎం రేవంత్ ఉద్ఘాటించారు. రూ.వంద పెట్టి పెట్రోల్…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. నేను మాట్లాడటానికి మూడు సార్లు లేచానని, కాంగ్రెస్ – బీ ఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే నన్ను మాట్లాడనివ్వకుండ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారన్నారు. గత బడ్జెట్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే నియోజక వర్గానికి మీరు ఇచ్చినప్పుడు అది మిగతా జిల్లాలను విస్మరించడమేనా? అని ఆయన ప్రశ్నించారు.…
Bengaluru: బెంగళూర్‌లో దారుణం జరిగింది. మంగళవారం కోరమంగళ ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ హాస్టల్లో 22 ఏళ్ల యువతి గొంతుకోసి హత్య చేయబడింది. మృతురాలని బీహార్‌కి చెందిన కృతి కుమారిగా గుర్తించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరిగిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణ ఏ రైతు అప్పుల పాలు కావద్దని భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ వరంగల్ డెకరేషన్ లో చెప్పిండన్నారు. మంత్రివర్గమంతా దృఢ సంకల్పం నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాటను శిలాశాసనంగా భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ…