ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. సంబంధిత ₹3,01,116/- రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సచివాలయంలో అందజేశారు.
కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం తగ్గిపోయింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయాన్ని డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనమనేని సాంబశివరావు పరిశీలించారు. జిల్లా అధికారులతో కలిసి బోటులో కిన్నెరసాని జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టూరిజం హబ్‌గా కిన్నెరసాని, హోలాండ్ తరహలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేవిధంగా ప్రణాళిక చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం…
వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం ఆరున్నర గంటలకు అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం వరంగల్‌లోని మెగా టెక్స్టైల్ పార్కును కొరియన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిపారు. ఈ పర్యటనలో ఆయన వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు , అధికారుల బృందం ఉన్నారు. “#KOFOTI (కొరియా టెక్స్టైల్ ఇండస్ట్రీ) నిర్వహించిన బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో కొరియన్ టెక్స్టైల్స్ కంపెనీల నుండి మరిన్ని పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా #వరంగల్‌లోని మెగా టెక్స్టైల్…
నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీస్‌పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది.
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనలు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని తొలగించడానికి దారితీసింది. బంగ్లాదేశ్‌లో నిరసనలకు విద్యార్థులే నాయకత్వం వహించినట్లు కనిపించినప్పటికీ.. ముఖ్యంగా మైనారిటీ హిందువులపై హింస ఉగ్రవాద సంస్థలచే నిర్వహించబడిందని నిఘా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా.. ఉగ్రవాద సంస్థల నుండి భారతదేశానికి ముప్పు పెరుగుతోందని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు సమాచారం.
భక్తులకు శుభవార్త.. విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ నిర్వహాకులు శుభవార్త తెలిపారు. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైనున్న విష్ణు పుష్కరిణిలో భక్తులకు సంకల్ప స్నానం ఆచరించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసం మొదటి ఆదివారం యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా అధికారులు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించారు. ఆలయ అధికారులు…
తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌పై నెట్టేసి తప్పుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో.. తుంగభద్ర నుంచి 90,000 క్యూసెక్కుల నీరు బయటకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల కొన్ని జిల్లాలకు వరద ముంపు ఏర్పడిందన్నారు.