హైదరాబాద్‌లో పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కామాటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు చెలరెగాయి.. దీంతో.. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే.. వెంటనే గోదాం సిబ్బంది అగ్ని మాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో నిమిషాల వ్యవధిలో 5 ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమిస్తున్నప్పటికీ, మంటలు అదుపులోకి రావడం లేదు. కెమికల్ గోదాం కావడంతో డబ్బాలు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. దాంతో, మంటలు మళ్లీ మళ్లీ చెలరేగుతున్నాయి. ఘటన జరిగిన గోదాం పక్కనే మరికొన్ని కెమికల్ గోదాంలు ఉండటంతో స్థానికుల్లో ఏం జరుగుతుందో అన్న భయం నెలకొంది. అయితే ప్రమాద స్థలంలో ఉన్న రెండు సిలిండర్‌లు పేలడంతో పక్కనే ఉన్న మరో గోదాంకు మంటలు వ్యాపించారు. దట్టంగా పొగ అలుముకోవడంతో ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TGSRTC : ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడికి ఫిట్స్.. డ్రైవర్ ఉదారత