రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అనిరుధ్ తల్లి బాధను మీరు విన్నారు, అలాంటి బాధ ఎవరు పడవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్టల్లో అనిరుధ్ చదువుతున్నాడు,ఎంతో మంది తల్లిదండ్రుల బాధపడే అంశమని, కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందని అందరికి తెలుసు…
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక మంత్రి ఎమోషనల్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు 53రోజులు ఇదే రాజమండ్రి జైలులో ఉంచారు. ఎలాంటి తప్పు చేయకుండా చంద్రబాబును జైలులో పెట్టారని నాటి పరిస్థితి గుర్తు చేసుకొని ఆవేదన చెందారు.
రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్ పై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేసారని, పెట్టబడులకు తెలంగాణను స్వర్గంగా మార్చుతున్నారన్నారు. రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం కావడం బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని, సూటు బూటు వేసుకొని దావొస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలను తెలంగాణకి తెచ్చారన్నారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ ఏంవోయూ కుదుర్చుకున్న…
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ ఫైల్ చేశారు. ఆయన వెంట బొత్స ఝాన్సీ, ఎంపీ తనుజారాణి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టు భావించాలని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక శాస్త్రవేత్త దేశం గురించి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో విక్రమ్ సారాబాయ్ జీవితమే ఉదాహరణ అంటూ ఆయన మాట్లాడారు.
కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలని, అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందిస్తే… రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ అనేక పాపాలను యాడ్ చేసిందని ఆయన మండిపడ్డారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమని ఆయన ధ్వజమెత్తారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే… అందులో కాంగ్రెస్ అనేక పాపాలను జత చేసిందని…
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు వెల్లడించారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష చేపట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ లోని తమ నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. Mamata Banerjee: ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య కేసును వేగంగా ఛేదించాలి..…
ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కాం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. తణుకులో టీడీఆర్ స్కాంపై ఏసీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు. తణుకు టీడీఆర్ బాండ్ల స్కాం జరిగిన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. టీడీఆర్ స్కాంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు…