మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. నలసోపరా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్యూషన్ క్లాస్‌లో నిందితుడు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడైన స్కూల్ టీచర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అమిత్ దూబే (30)గా గుర్తించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: Pappachan murder: “నాకంటూ ఎవరూ లేరు” అని చెప్పడమే పాపమైంది.. సంచలనంగా కేరళ మర్డర్ కేసు..
పెల్హార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర వంకోటి ఈ ఘటనపై మరింత సమాచారం అందించారు. ఈ ఏడాది మార్చి నుంచి జూలై మధ్య కాలంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. నిందితుడు ఏదో ఒక సాకుతో బాధితురాలిని తన ఇంట్లో ఉన్న ట్యూషన్ సెంటర్‌కు పిలిచి అత్యాచారం చేసే వాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ సెక్షన్ 64 (2) (ఎఫ్), 65 (1) కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.
Read Also: Bombay High Court: అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై చట్టపరమైన హక్కు లేదు..
మరోవైపు.. మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై కోల్‌కతాలో కలకలం రేగుతున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రంలోగా కేసు డైరీని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కోల్‌కతా పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే మిగతా అన్ని పత్రాలను బుధవారం ఉదయం 10 గంటలలోపు కోర్టుకు అందజేయాలని పేర్కొంది.