పాతబస్తీ బాలాపూర్‌లో రౌడీ షీటర్ రియాజ్ హత్య కేసును బాలాపూర్ పోలీసులు ఛేదించారు. ఈనెల 9వ తేదీన బాలాపూర్ ARCI రోడ్డుపై రియాజ్ పై కాల్పులు జరిపి హతమార్చింది సూపారీ గ్యాంగ్. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాలాపూర్ లో జరిగిన గ్యాంగ్ స్టర్ రియాజ్ హత్య కేసును ఛేదించామని, ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ చేశామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రధాన నిందితుడు హమీద్ పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు. 13 లక్షలకు సుపారీ హత్య చేసినట్లు గుర్తించామని, నిందితుల నుంచి కంట్రీ మేడ్ గన్, రెండు బుల్లెట్స్, రెండు గొడ్డళ్లు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు సీపీ. మీర్‌పేట్‌లో వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్ లో ల్యాండ్ డిస్ప్యూట్ తో మొదట గొడవ స్టార్ట్ అయిందని, ఆ తర్వాత ప్రధాన నిందితుడు, మృతుని మధ్య గొడవలు పెరిగిపోయాయన్నారు సీపీ సుధీర్ బాబు. మృతుడు రియాజ్ రౌడీ షీటర్ అని, మీర్‌పేట్ లో ల్యాండ్ వివాదం పై ఒకరిపై ఒకరు కేసులు పెట్టారన్నారు.
Vinesh Phogat Verdict: వినేశ్ ఫోగట్ రజత పతకంపై డబ్ల్యూఎఫ్ఐ బిగ్ న్యూస్..
ప్రధాన నిందితుడు హమీద్.. గోల్కొండకు చెందిన సలీంకి 13 లక్షల సూపారీ ఇస్తానని చెప్పాడని, అడ్వాన్స్ గా 2 లక్షల 50 వేలు ఇచ్చాడన్నారు. మర్డర్ ప్లాన్ చేసి… హమీద్ దుబాయ్ కి వెళ్ళిపోయాడని, హమీద్, సలీం యూపీ కి వెళ్లి కంట్రీ మేడ్ గన్ కొనుక్కొని వచ్చారన్నారు సీపీ. మొయినాబాద్ దగ్గర గొడ్డళ్లు, కత్తులు కొన్నారని, రియాజ్ ను చంపడానికి ముందే రెక్కీ చేశారన్నారు. అంతేకాకుండా..కంచన్ బాగ్ లోని ఓ వైన్స్ లో రియాజ్ తాగి బైక్ పై వస్తుండగా… కార్ తో ఢీకొట్టారు. అతను కింద పడగానే కళ్ళల్లో కారం చల్లారని, అతను కిందపడగానే కత్తి, గొడ్డళ్ళ తో దాడి చేశారని సీపీ పేర్కొన్నారు. ఆ తర్వాత సలీం గన్ తో షూట్ చేశాడని, మర్డర్ చేసిన తర్వాత విజయవాడ కి వెళ్ళారన్నారు… అక్కడ కార్ వదిలేసి వైజాగ్ కి బస్ లో వెళ్ళారన్నారు. అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళారని, అక్కడ నిందితులను అరెస్ట్ చేశామని, A7 ఇనాయత్ ఈ మర్డర్ ప్లాన్ కి డబ్బులు ఇచ్చాడు. రియాజ్‌ను చంపితే తాను డాన్ అవుతానని నిందితుడు హమీద్ భావించాడని సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Mumbai: ముంబైలో ఘోరం.. 3 ఏళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అఘాయిత్యం