Minister Parthasarathy: రాష్ట్రంలో వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు, రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యమని ఏపీ గృహనిర్మాణి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టామని, మైలవరంలో ఇళ్ల స్థలాల అంశంలో ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో నిర్ణయించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవన్న ఆయన.. కొన్నిచోట్ల వరదలు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా భూములను తీసుకుందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం రాజకీయ కక్షపూరిత ఆలోచనలు కారణంగా ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందిపడ్డారన్నారు. గృహ నిర్మాణంలో మట్టికోసం కొత్త విధానం ఆలోచించామని… ఫ్లై యాష్‌ను వాడే విధంగా ఆలోచించామన్నారు. 2014-2019 గృహ నిర్మాణాలపై కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని.. 2014-19 నాటి గృహాలకు కూడా డబ్బు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో గృహనిర్మాణాలను వ్యాపార ధోరణిలో చూశారని విమర్శలు గుప్పించారు.
Read Also: TDR Bonds: టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా సర్కార్ చర్యలు
చాలా నిర్మాణ సంస్థలు డబ్బులు తీసుకొని నిర్మాణాలు ఎగ్గొట్టారని మా దృష్టికి వచ్చిందని మంత్రి వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో క్వాలిటీ చెక్ కూడా పూర్తిగా చేస్తున్నామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. లబ్ధిదారులను నష్టపరచిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. 500 ఇళ్లు లోబడి నిర్మాణం చేసే వారిని గుర్తించి వారికి నగదు చెల్లించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు రుణం పొంది కూడా నిర్మాణం చేయకపోతే.. భవిష్యత్తులో ఇబ్బందిపడతారని హెచ్చరించారు. స్థానిక అధికారులు, ఎమ్మెల్యేలు లు లబ్ధిదారుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. కేంద్రం ఇళ్ళ నిర్మాణానికి 1.5 లక్షలు మాత్రమే ఇస్తుందని తెలిసిందని మంత్రి తెలిపారు.గృహ నిర్మాణం అత్యంత ముఖ్యమైన అంశంగా సీఎం చంద్రబాబు తెలిపారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.