సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి మైనంపల్లి హనుమంతరావు సవాల్ విసిరారు. రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో ఇద్దరం నిలబడదామని, మళ్లీ హరీష్ రావు గెలిస్తే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి రావాలి మైనంపల్లి హనుమంత రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. బీఆరెస్ రుణమాఫీ సమస్యపై సమావేశం నిర్వహించగా, కాంగ్రెస్…
రాష్ట్రంలో వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు, రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యమని ఏపీ గృహనిర్మాణి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టామని, మైలవరంలో ఇళ్ల స్థలాల అంశంలో ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయన్నారు.
కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, రాజకీయాలు మీకు..మాకు అవసరమే.. కానీ ఏం మాట్లాడాలో..ఎలాంటి విషయాలు మాట్లాడాలో తోయడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్.. ఎక్కడైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ తీసుకో బెటర్ అని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం బలిదానం అయ్యారని, మిలిటెంట్లు కాల్చి చంపింది నిజమే కదా ? అని ఆయన అన్నారు. కేసీఆర్ గారు.. కేటీఆర్ కి…
టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో వాగు దాటుతుండగా ఇద్దరు టీచర్లు ప్రమాదవశాత్తు చనిపోయారు. అయితే ఈ విషయంలో స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు.
తెలంగాణలో పెరుగుతున్న పోలీసుల ఉదాసీనతను విమర్శిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళనకు దిగారు. చట్టాన్ని అమలు చేయకపోవడం, పెరుగుతున్న వేధింపులు మరియు రాజకీయ పూజలను సూచించే వివిధ సంఘటనలను ఆయన ఉదహరించారు. ట్విట్టర్ వేదికగా ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు కేటీఆర్. అక్కడ ఒక స్వీట్ షాప్ యజమాని “పోలీసుల వేధింపుల కారణంగా దుకాణం మూసివేయబడింది” అని పేర్కొంటూ దాని ముందు భారీ బ్యానర్‌ను…
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్ కొనసాగుతోంది. జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
పంట రుణాలు మాఫీ కాని రైతుల నుంచి మంగళవారం వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించగా, అందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ రైతులు వివిధ చోట్ల బైఠాయించారు. వేంసూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ రైతు వేదిక వద్ద రైతులు నిరసన చేపట్టారు. రైతులకు మద్దతు తెలుపుతూ అఖిల…
సచివాలయంలో జలాశయాల పూడిక తీత పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. చైర్మన్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల, రెవిన్యూ, ఖనిజాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాలికతో…