KTR : రుణమాఫీలో కటింగ్ పెడితే.. రైతుభరోసాలో కూడా కటింగ్‌లు పెడుతాడు
- చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
- రుణమాఫీపై విమర్శలు
- దైవ ద్రోహం చేసిండు ఈ దుర్మార్గుడని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడన్నారు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశామని, ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు చెప్పారన్నారు కేటీఆర్. దీంతో తప్పించుకునేందుకు చావు తెలివితేటలు స్టార్ట్ చేయటం మొదలు పెట్టాడని, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ. 40 వేల కోట్లు కట్టేస్తా అని 9 వేల కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడాడని, పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి…ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15 కు రుణమాఫీ చేస్తా అని చెప్పాడన్నారు కేటీఆర్. ఆగస్ట్ 15 పోయింది. రుణమాఫీ కాలేదు. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండని, దైవ ద్రోహం చేసిండు ఈ దుర్మార్గుడని, కేసీఆర్ ను తిట్టి నాలుగు ఓట్లు వేయించుకొని ఆ తర్వాత అవతలపడ్డాడన్నారు కేటీఆర్ అన్నారు.
Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కుప్పకూలుతున్న జనాలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అంతేకాకుండా..’ఆ తర్వాత జులైలో మంత్రివర్గంలో చర్చించి ఏదో విధంగా కటింగ్ పెట్టాలని సీఎంకు మంత్రులు సలహా ఇచ్చారు. అందుకే కేబినెట్ లో మీటింగ్ నాటికి దాన్ని రూ. 31 వేల కోట్లకు దాన్ని తగ్గించారు. సబితక్క రేవంత్ రెడ్డికి పాలన చేతనైతలేదని చెబితే కోపం వచ్చి మహిళా శాసనసభ్యులను అవమానించాడు. ఒక ఆడబిడ్డ నాలుగున్నర గంటలు నిలబడి మైక్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏడిపించి దుర్మార్గంగా వ్యవహారించారు. సబితా ఇంద్రారెడ్డి లాంటి నేతను నిండు శాసన సభలో అవమానించాడు. ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చే సత్తా లేని కారణంగానే ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందని ఖమ్మం జిల్లాలో సీఎం చెప్పటంతో మొత్తం రైతులు తిరగబడ్డారు. దీంతో రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. నీ సొంత ఊళ్లో రైతులకు వంద శాతం రుణమాఫీ అయినట్లు రైతులు చెబితే రాజీనామా చేస్తా అని నేను సవాల్ చేసినా. నా సవాల్ కు సమాాధానం లేదు. స్పందన లేదు. రైతుల మిత్తి తో సహా ఎలాంటి కొర్రీలు, ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనన్నదే మన డిమాండ్. రుణమాఫీ లో కటింగ్ పెడితే…రైతుభరోసాలో కూడా కటింగ్ లు పెడుతాడు. మీరు ఇప్పుడు వదిలిస్తే….తర్వాత కూడా ఇదే విధంగా కోతలు పెట్టుకుంటు పోతాడు.
OTT Release : ఈ వారం ఓటీటీలో రచ్చ చేయనున్న సినిమాలు ఏవో తెలుసా..?
కొండారెడ్డి పల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్ట్ లపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి నిజంగా రుణమాఫీ వంద శాతం అయితే ఎందుకు మహిళా జర్నలిస్ట్ లపై దాడులు చేయించావ్. వారిని అవమానించావ్. ఇవ్వాళ్టి పోరాటం మొదటి అడుగు మాత్రమే. రైతులందరికీ మొత్తం రూ. 2 లక్షలు రుణం మాఫీ చేసే వరకు వదిలిపెట్టం. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు. భారత రైతు సమితి కూడా. మొత్తం రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదు. రేవంత్ రెడ్డి లాగా మనం బజారు బాష మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం.’ అని కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!