Telangana Govt : రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక మిషన్.. 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సిటీ నిర్మాణం, రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు కీలక అడుగు వేసింది. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) పేరుతో కొత్త కార్యాచరణకు దిగింది. ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, పనులను దీని పరిధిలోకి చేర్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్‌లో 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో.. పనులను వేగంగా పూర్తి చేసే సంకల్పించారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంది. స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) పేరుతో కొత్త కార్యాచరణ చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, పనులను speed పరిధిలో చేర్చారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వీటిని స్వయంగా సమీక్షిస్తారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమవుతారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలనేది speed లక్ష్యం.
Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ ప్రదర్శిస్తుంది. ఆలస్యం జరగకుండా నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. పట్టణాలకే పరిమితం కాకుండా… అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై స్పీడ్ దృష్టి కేంద్రీకరిస్తుంది. స్పీడ్ కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిర్ణీత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటివరకు ఏయే పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను ప్రస్తావిస్తారు. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమం తప్పకుండా పనితీరును సమీక్షించుకొని పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తుంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్ డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తుంది.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
స్పీడ్ ప్రోగ్రామ్ లోని 19 ప్రాజెక్టులు
- మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్,
- శాటిలైట్ టౌన్ల అభివృద్ధి,
- మెట్రో రైలు విస్తరణ,
- జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ,
- రీజినల్ రింగ్ రోడ్,
- హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు,
- రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు,
- ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం,
- మహిళా శక్తి పథకం అమలు,
- జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం,
- రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్‌లు,
- అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి,
- ఐటీఐలలో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు,
- కొత్త ఉస్మానియా హాస్పిటల్,
- 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు,
- హెల్త్ టూరిజం ప్రమోషన్
- ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్,
- టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం,
- యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలు
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!