పంజాబ్లోని అమృత్సర్లో శనివారం ఉదయం ఓ ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎన్నారైపై రెండుసార్లు కాల్పులు జరిపారు. బాధితుడు 43 ఏళ్ల సుఖ్చైన్ సింగ్గా గుర్తించారు.
ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్ ల్యాబ్లో కెమికల్ పౌడర్ వాసన పీల్చి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గల కారణం కెమికల్ పౌడర్ అని సహచర విద్యార్థులు చెబుతున్నారు.
రష్యాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు జైలు ఉద్యోగులు కూడా ఉన్నారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని అత్యంత భద్రత కలిగిన ఐకే-19 సురోవికినో శిక్షాస్మృతి కాలనీలో ఈ హింసాకాండ చోటుచేసుకుంది.
మహిళపై పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ప్రతి పక్ష పోషిస్తున్నారా అర్థం కాట్లేదని, మమ్ముల్ని జుట్టు పట్టుకుని బూట్లతో తన్నారని ఆమె ఆరోపించారు. సీపీ విచారణ చేసి యూనిఫాం వేసుకున్న దొంగ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు బ్రేక్ డాన్స్ లు వేస్తారన్న కేటీఆర్ ఇంట్లో కూడా బ్రేక్ డాన్స్ లు వేస్తున్నారా…
నోయిడాలో పోలీసులు కాల్పులు చేపట్టారు. అనంతరం నోయిడా పోలీసులు నలుగురు దుండగులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదుతోపాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. దుండగులపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు దుండగులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. అక్రమ కట్టడం పేరుతో తన కన్వెన్షన్ సెంటర్ ను ఇవాళ కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ జరిపారు.
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్ .. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం వానపల్లిలో గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 17500కిలో మీటర్లు సీసీ రోడ్లు వేస్తామన్నారు. మట్టి అంటకుండా బయటకు వెళ్లేలా చేస్తామన్నారు. 10వేల కిలోమీటర్లు మురికి కాల్వలు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒక…
Home Minister Anitha: విశాఖలోని గాజువాక వడ్లపూడి పవన్ సాయి ఆస్పత్రిలో అచ్యుతాపురం సెజ్ బాధితులకు చెక్కులు అందజేశారు హోం శాఖ మంత్రి అనిత. బాధితులకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారికి కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షల రూపాయలు అందజేశామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులుకు అండగా నిలబడ్డామన్నారు. ఆస్పత్రిలో సీఎం చంద్రబాబు బాధితుల కుటుంబాలతో మాట్లాడి వారిని ఓదార్చారని తెలిపారు. అన్ని…
కోల్కతాలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14న తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో అన్ని ఎలక్టివ్ డ్యూటీలు, ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరించిన తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ( TJUDA) తమ నిరసనలను శుక్రవారం విరమించుకుంది. ఔట్ పేషెంట్, ఎలక్టివ్లు, వార్డు విధులు, అత్యవసర సంరక్షణతో సహా అన్ని వైద్య సేవలు శనివారం నుండి అంతరాయం లేకుండా పనిచేస్తాయని TJUDA శుక్రవారం తెలిపింది. “డాక్టర్ అభయకు న్యాయం చేయడానికి…