తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 8 అంశాలపై కేంద్ర ఆర్ధిక మంత్రి కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. కేంద్ర మంత్రి చాలా సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సహాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, పెండింగ్ నిధులను వెంటనే విడదల…
వందే భారత్ స్లీపర్ రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు శుభవార్త. వందే భారత్ రైళ్ల విజయవంతమైన తర్వాత.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే యోచిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించాలని భావిస్తున్నారు.
మొట్టమొదటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగించిన ఇండియా భారతదేశం తన మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ 1 ను ప్రయోగించింది. చెన్నైలోని తిరువిడండై నుంచి రాకెట్ను ప్రయోగించారు. రూమి 1ని తమిళనాడు స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ అభివృద్ధి చేశాయి. మొబైల్ లాంచర్ సహాయంతో ప్రారంభించబడింది. 3 క్యూబ్ ఉపగ్రహాలు, 50 PICO ఉపగ్రహాలతో రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ప్రయోగం తర్వాత, హైబ్రిడ్ రాకెట్ పోలోడ్ను సముద్రంలోకి విడుదల చేసింది.…
టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా వెస్టిండీస్ ప్లేయరు నికోలస్ పూరన్ నిలిచాడు. అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్లను వెనక్కి నెట్టి పూరన్ మూడో స్థానానికి ఎగబాకాడు.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖలు ఉద్యోగుల బదిలీలకు గైడ్లైన్స్ జారీ చేస్తు్న్నాయి. రవాణ శాఖలో రెండేళ్లకే స్థాన చలనం ఉండేలా గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. రవాణా శాఖలోని ఉద్యోగ సంఘాలు ఏవీ కోరకుండానే బదిలీల్లో గైడ్ లైన్స్ జారీ అయినట్లు తెలిసింది.
జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించి.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుదల, విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గారు.. మొన్న ఫారుఖ్ అబ్దుల్లా ఇంటికెళ్లి ఒప్పందం చేసుకుని వచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ కిషన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై కాంగ్రెస్ ఆలోచన ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని.. అన్న నేషనల్ కాన్ఫరెన్స్ ని సమర్థిస్తారా? అని ఆయన…
16 మంది సభ్యులలో 15 మంది అతనికి మద్దతు ఇవ్వడంతో జైషా తదుపరి ఐసీసీ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐసీసీలో చేరితే అతడి స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు నియమిస్తారనే దానిపై స్పష్టత లేదు. అధికారిక నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీ కాబట్టి.. జైషా నిర్ణయం తీసుకోవడానికి 96 గంటల కంటే తక్కువ సమయం ఉంది. కాగా.. ఐసీసీ కొత్త చైర్మన్ డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.
పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లి వచ్చి ప్రమాదంపై మంత్రులు ,ప్రభుత్వం స్పందించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని.. ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తం అయిందన్నారు.
జంటనగరాల్లో జరగనున్న గణేష్ చతుర్థి వేడుకలపై చర్చించేందుకు శనివారం అంతర్ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. GHMC, HMWS&SB, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్, పోలీస్, TSRTC, మెట్రో రైల్, దక్షిణ మధ్య రైల్వే, TGSPDCL, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇరిగేషన్, టూరిజం, EMRI , భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి , ఖైరతాబాద్ గణేష్ సమితి…