తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో శ్యామలారావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారిలో పోతిరెడ్డి లోకేష్(19) విద్యార్థి మృతదేహం లభ్యం కాగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీల పొత్తుకు ఎజెండా లేదని.. కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలోనూ చేరబోమని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి,పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండని, రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ఎంత పెద్ద వాళ్లు ఉన్న చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు…
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఏడీసీ నర్సరీలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ. 41వేల కోట్లతో అమరావతికి గతంలో టెండర్లు ఇచ్చామని.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు.
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు రి కన్స్ట్రక్షన్ అవుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైల్వే కేంద్ర సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్ మాట్లాడుతూ.. 712 కోట్లతో మొదటి విడత స్టేషన్ అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అధునాతనమైన టెక్నాలజీ అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.…
ప్రియుడు మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన దిల్షాద్ అనే మహిళకు తమిళనాడుకు చెందిన హుస్సేన్‌తో వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు.
తెలంగాణ ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు అయ్యాయి. త్వరలో MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. TG ICET ర్యాంకుల ఆధారంగా ప్రవేశాల కోసం TGCHE కేంద్రీకృత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది.
రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలియజేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందని తెలిపారు.