మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయింది. ఆ మహిళ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతుండగా.. ఒక్కసారిగా ఫుట్‌పాత్ కుంగడంతో.. ఆమె డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది.
హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్-కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని నాగార్జున పేర్కొన్నారు
హైదరాబాద్‌లో పాత బస్తీ ప్రాంతంలోని ఓ బ్యాంక్‌లో రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు భారీ సైబర్ క్రైం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరు ఆటో రిక్షా డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో-రిక్షా డ్రైవర్లు జాతీయ బ్యాంకులో ఆరు ఖాతాలను తెరిచారు, సైబర్ నేరగాళ్ల ద్వారా నిధుల బదిలీని సులభతరం చేశారు. ఈ నిధులను హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు తరలించారు. సైబర్ నేరగాళ్లు నిధులను బదిలీ చేయడానికి క్రిప్టోకరెన్సీని కూడా ఉపయోగించారు.…
మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పెన్షన్‌ను రూ.50 వేలకు పెంచుతున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.22 వేలు పింఛన్ అందుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది.
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఏలూరులో నేడు తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగింది.
పాకిస్థాన్‌పై విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు.. అటు శ్రీలంకపై విజయంతో ఇంగ్లండ్ కూడా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల గురించి మాట్లాడినప్పుడల్లా ఎలాన్ మస్క్, జెఫ్ బోజెస్, ముఖేష్ అంబానీ తదితరుల పేర్లు తెరపైకి వస్తాయి. వారు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు అనడంలో సందేహం లేదు. అయితే వీరంతా పురుషులే. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? ఈ మహిళ పేరు ఆలిస్ వాల్టన్. 74 ఏళ్ల ఆలిస్ వాల్టన్ ఒక పెద్ద అమెరికన్ వ్యాపార మహిళ. ఆమె వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె.
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలో క్లియర్ చేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ, త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని, దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండేళ్లలో ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయని ఆయన అన్నారు.…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. సీపీఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుంది. కేంద్రం ఈ నిర్ణయంతో వీరంతా యూపీఎస్ పరిధిలోకి రానున్నారు.
ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోంది! ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా…