జమ్మూకశ్మీర్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహించనున్నారు. కాగా.. బీజేపీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్‌లలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
Read Also: Sunita Williams Salary: సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా?.. షాక్ అవ్వాల్సిందే!
వీరితో పాటు.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి, శివరాజ్ సింగ్ చౌహాన్, జితేంద్ర సింగ్ ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ.. జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మొత్తం 40 మంది నేతలు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు.
Read Also: Honor killing: పేరెంట్స్ గొంతుకోసి చంపిన కొడుకు.. తల, మొండం వేరు చేసి..!
జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ మొదటి దశ, 25వ తేదీన రెండో దశ.. అక్టోబర్ 1వ తేదీన మూడో దశ పోలింగ్ జరగనుంది. కాగా.. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న జరుగుతుంది.