Ponnam Prabhakar : రాష్ట్రం భవిష్యత్‌లో క్రీడా రంగంలో నంబర్ 1గా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్బి స్టేడియంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ ను , టీ షర్ట్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 29న ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా స్పోర్ట్స్ డే లో భాగంగా పోస్టర్, లోగో ఆవిష్కరించడం జరిగిందన్నారు. ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని ఆయన తెలిపారు. ఇటీవల కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా సంస్థలు క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత అని, తెలంగాణ లో కూడా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి తెలంగాణ లో ప్రజా పాలన లో క్రీడాకారులను వారి నైపుణ్యాలను బయటకు తెచ్చివిధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుందని ఆయన తెలిపారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 మంది స్టార్ క్యాంపెయినర్లు.. జాబితా విడుదల చేసిన బీజేపీ
అంతేకాకుండా..’అందులో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.. రాష్ట్రం భవిష్యత్ లో క్రీడా రంగంలో నంబర్ 1 ఉండాలి.. క్రీడా రంగంలో భవిష్యత్ లో పాఠశాల దశ నుండి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని ప్రయత్నం లో భాగంగా క్రీడా దినోత్సవం ఘనంగా జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.. మంత్రులు ,ఎమ్మేల్యేలు , ప్రభుత్వ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.. 29 నాడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేస్తారు.. అన్ని జిల్లాల్లో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన తల్లిదండ్రుల స్పందన ముఖ్యం పిల్లలను ప్రోత్సహించాలి.. శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యారు.. స్పోర్ట్స్ కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరుగుతుంది.. కరీంనగర్ లో కూడా స్పోర్ట్స్ స్కూల్ ఉంది.. స్పోర్ట్స్ కార్యక్రమానికి తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలి.. ‘ అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
Also Read
Minister Atchannaidu: ప్రజలు మెచ్చే నాయకుడిగా పనిచేసి చూపిస్తా..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?