శ్రీకాకుళం జిల్లాలో పీఆర్టీయూ యూనియన్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
రిలయన్స్ జియో హెచ్చరికలు జారీ చేసింది. జియో తన పేరుతో జరుగుతున్న మోసానికి సంబంధించి ఈ వార్నింగ్ ఇచ్చింది. జియో పేరుతో ప్రజలను మోసాలకు గురిచేస్తున్నారని కంపెనీ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో టెలికాం కంపెనీ జియో మొబైల్ వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ)కి వచ్చే ప్రయాణికులు అనధికారిక షేర్డ్ టాక్సీ మోసాలకు ఎక్కువగా గురవుతున్నారు, ఫలితంగా నిరాశ , అసహ్యకరమైన అనుభవాలు ఉన్నాయి. Reddit , Quora వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని అనేక నివేదికలు మోసం యొక్క ఇబ్బందికరమైన నమూనాను వెల్లడిస్తున్నాయి, ఇక్కడ ప్రయాణీకులు రైడ్-షేరింగ్ ఏర్పాట్ల గురించి తప్పుదారి పట్టిస్తారు , పొడిగించిన నిరీక్షణలు , ఊహించని ఛార్జీలను ఎదుర్కొంటారు. ఈ స్కామ్‌ల యొక్క ముఖ్యాంశం షేర్డ్ రైడ్ల భావనలో…
భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో ఎంజాయ్ చేద్దామనుకుంది భార్య. అందుకోసం అతన్ని ఇంటికి పిలిపించుకుంది. కానీ.. కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఈ ఘటన యూపీలోని మహారాజ్‌గంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరు కావడం కోసం వెళ్ళాడు. ఈ క్రమంలో.. భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.
నాంపల్లిలోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత – లింగ సమానత్వం పై ఆల్ ఇండియా లెవెల్ ఎడ్యుకేషన్ సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో సగం కంటే ఎక్కువే అని, వృత్తి ,ఉద్యోగ ,వ్యాపార రీత్యా ,గృహ…
కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ నాగర్ కొత్వాలి ప్రాంతంలోని చిల్బిలా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం యువకుడు బయల్దేరగా.. ప్రియురాలు కూడా తనతో పాటు రైల్వే స్టేషన్ కు వచ్చింది. వారికి ఏ సమస్య వచ్చిందో తెలియదు గానీ.. రైలు దగ్గరికి రాగానే దాని ముందు దూకి సూసైడ్‌కు…
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి బుస కొట్టింది.. తర్వాత సైలెంట్ అయ్యిందని, రేవంత్ కూల్చేయడం మంచిదే అని ఆయన అన్నారు. నాగార్జున మంచి నటుడు కావచ్చు.. కానీ కక్కుర్తి ఎందుకు అని ఆయన అన్నారు. సినిమా డైలాగులు కొట్టడం కాదు అని, బుకాయింపు మాటలు వద్దని.. క్షమాపణ చెప్పాలి నాగార్జున అని ఆయన అన్నారు. ఇన్నాళ్లు అనుభవించిన దానికి ప్రభుత్వంకి పరిహారం…
హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతోటే యథేచ్ఛగా చెరువులు కబ్జాలకు గురైనవి అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా చేయడానికి అని ఆయన మండిపడ్డారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు,111, ఎఫ్టిల్, బఫర్ జోన్ భూములన్ని కబ్జా చేసిండ్రు అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ…
తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు బస్టాండ్‌లో పర్యటించింది ఎన్హెచ్ఎల్ ఎం కమిటీ. కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా తో కలిసి ఎంపి గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపీ గురుమూర్తి.
బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపి హెల్త్‌కేర్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలను మెరుగుపరచే దిశగా.. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BROEC) అపోలో మెడ్‌స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ముఖ్యమైన విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. అపోలో మెడ్‌స్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్.