ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్ పై టీమిండియా క్రికెటర్ అసంతృప్తి.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ.. ‘ నేను ప్రయాణిస్తున్న విమానంలోనూ ఇలాంటి ఘటన ఎదురైంది. ఇండిగో ఎయిర్ లైన్స్‌లో ఇది సర్వ సాధారణమైపోయింది. మీతో ముందు పేమెంట్ చేయిస్తాయి. ఆ తర్వాత వారికి ఇష్టమైన సీటింగ్ ఇస్తారు. మనం ఏం కోరుకున్నా…
ప్రకాశం జిల్లా ఒంగోలులో శిశువు విక్రయం కలకలం రేపింది. ఒంగోలు రిమ్స్ లో రూ. పది వేలకు కన్న కూతురుని విక్రయించింది తల్లి. ఆమె అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తుంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరుకి చెందిన ఓ వ్యక్తికి మధ్యవర్తుల ద్వారా విక్రయించింది. అయితే.. పాపను వారికి అమ్మిన తర్వాత రిమ్స్ లో కనిపించకుండా పోయింది అంగన్వాడీ కార్యకర్త.
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్ కి చెందినటువంటి 8 ఎకరాల తుమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయం చేశారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మున్సిపాలిటీ చైర్మన్ కాంటికర్ మధుమోహన్ తో కలిసి కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురవుతున్నాయని, దాదాపుగా 15…
యూపీలో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. గోండా జిల్లాలోని ఖోదరే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులను నలుగురు యువకులు బైక్‌లపై కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.
పెరుగుతున్న డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన సమస్యను గుర్తించి తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సూచించారు. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, శనివారం కనీసం ఐదుగురు, సోమవారం మూడు మరణాలు నమోదయ్యాయని రామారావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు మందుల కొరతను ఎదుర్కొంటున్నాయని, పెరుగుతున్న కేసుల కారణంగా చాలా ఆసుపత్రుల్లో ముగ్గురు నలుగురు రోగులు ఒకే బెడ్‌ను…
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని నమిత వీడియోను రిలీజ్ చేశారు, నన్ను, నా కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని సిబ్బంది దురుసుగా, అహంకారంగా మాట్లాడారని నమిత వీడియోలో తెలిపింది.
వారం రోజులుగా కేటీఆర్, అతని మనుషులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమం, ప్రజల సమస్యలు చూపేందుకు v6 ఛానెల్ ను స్థాపించామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటసామి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా ఆగకుండా తెలంగాణ కల్చర్ చూపించింది v6 ఛానల్ అని, కాళేశ్వరం, మిషన్ భగీరధ లో జరిగిన అక్రమాలు, లోపాలను v6, వెలుగు పేపర్లు చూపించాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఈ రెండు…
గత ప్రభుత్వంలో పాలనా మొత్తం అస్తవ్యస్తంగా సాగిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. 19 వందల కోట్ల పురపాలక శాఖ నిధులు ఇతర పనుల కోసం మళ్ళించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక్క తుడాలో మాత్రమే జీతాలకోసం 15కోట్లు ఖర్చు చేశారన్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ వ్యవస్థపై టీమిండియా సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ.. ' ఇండిగో ఎయిర్ లైన్స్‌లో ఇది సర్వ సాధారణమైపోయింది.