CM Revanth Reddy : ఇంకో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశామని, ఇంకో ముపై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నామని, సివిల్స్ విద్యార్థులకు అతస్థైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరికి లక్ష చిన్నది కావచ్చు.. కొందరికి లక్ష ఎక్కువ కావచ్చు అని, కానీ మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పడం కోసం మా ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. మీరు మా కుటుంబ సభ్యులు అని చెప్పే ప్రయత్నం మాది అని, చాలా కాలం సచివాలయం లేదని, సచివాలయం వచ్చాకా.. ఎవరికి అనుమతి లేదన్నారు. అలాంటి పరిస్థితి నుండి ఇది ప్రజలది అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. అందుకే మిమ్మల్ని కూడా ఇక్కడికే రప్పించామని, ఇంటర్వ్యూలలో కూడా ఐఏఎస్ కి సెలక్ట్ అవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Chiranjeevi: అభిమాని ఈశ్వరయ్య కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
అంతేకాకుండా..’మన పిల్లలు ఎందుకు ఐఏఎస్ లుగా ఎందుకు ఎంపిక కాకూడదు అని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పరీక్షల మీద దృష్టి పెట్టండి. తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు పరిమితం అవుతుంది. పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వాళ్లంతా .. వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళ కోసం వెతుకుతున్నారు. విద్యార్దులకు.. కంపనీ లకు గ్యాప్ కనిపిస్తుంది. అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. వచ్చే ఏడాది నుండి స్పోర్ట్స్ యూనివర్సిటీ. గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ పదేళ్లుగా నిరుపయోగంగా మారింది. ప్రతి నియోజక వర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఈ ఏడాది బడ్జెట్ లో ఐదు వేల కోట్లు పెట్టాం.. 100 నియోజక వర్గాల్లో కట్టబోతున్నం. పది పదిహేను రోజుల్లో vc ల నియామకం. గతంలో పరీక్షలు పెట్టాలి అని ఆందోళన జరిగేది. ఇప్పుడు మేము పరీక్ష పెడుతుంటే..కొందరు వద్దు అని ఆందోళన చేయిస్తున్నారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. గతంలో ఇలాగే రెచ్చగొట్టి విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ త్యాగం మీద రాజకీయం చేశారు. వాళ్ళ ఉద్యోగాలు పొగానే మళ్ళీ విద్యార్థుల రెచ్చగొడుతున్నారు. విద్యార్దులు ఎందుకు.. బావ బమ్మార్డులు దుక్కలెక్క ఉన్నారు.. మీరు దీక్షలు చేయండి అని నేను చెప్పిన. విద్యార్దులు కుట్ర లకు లొంగ కండి. సివిల్స్ ఇంటర్వ్యూలకు కూడా ఆర్థిక సాయం చేస్తాం. మా ప్రాధాన్యత రైతులు..విశ్వ విద్యాలయం .. ఉద్యోగాలు. గత పాలకులకు ప్రాధాన్యత ఇది కాదు.. భవనాలు…ఆస్తులు వారి ప్రాధాన్యత.. నల్గొండ జిల్లాలో ఎస్సైల ఎంపిక ఎక్కువ ఉంటుంది. 30 ఏండ్లు నుండి అక్కడ పోటీ ఎక్కువ. ప్రతి గ్రామంలో పోటీ పెరిగి si లు అవుతున్నారు. సివిల్స్ కూడా అలాగే పోటీ పడాలి.
మెయిన్స్ కి వెళ్ళాలి.. మీకు ఏ సమస్య వస్తె.. మీకు అన్నగా నేను అండగా ఉంట’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
Ongole: అమ్మతనానికి కలంకం.. పది వేలకు శిశువును అమ్మకానికి పెట్టిన తల్లి
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?