*అమరావతి: ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.
*విశాఖ: మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం.. ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడి.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిక.
*ఖమ్మం: మున్నేరుకు భారీ వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన వరద.. 16 అడుగులకు చేరిన మున్నేరు నీటిమట్టం.. నిన్న రాత్రి నుంచి 8 అడుగులు పెరిగిన వరద.. దానవాయుగూడెం, రామన్నపేట, ప్రకాష్ నగర్ , మోతీ నగర్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు.. గత నెల 30, 31 తేదీల్లో 36 అడుగులకు పైగా వచ్చిన వరద.. ఆ వరద నుంచి కోలుకోక ముందే మళ్లీ మున్నేరుకి వరద.
*నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.
*ఖమ్మం: నేడు పాలేరు నియోజకవర్గం వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.
* నేడు పెదకాకాని మండలంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన.. పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాల్ల నరేంద్రతో కలసి వరద ప్రభావిత గ్రామాలు వెంకట కృష్ణాపురం, తంగెళ్లమూడి, అనుమర్లపూడి, తదితర ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి
*తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం , వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,800.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,870.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.89,500.