ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్టీవీతో ప్రత్యేకగా చెప్పారు. పీసీసీలో 60 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వస్తాయని అన్నారు. పీసీసీ బీసీకి ఇస్తే.. పూర్తి వాటా దక్కింది అనుకోమని చెప్పారు. మరోవైపు.. కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలం అయింది. సంగారెడ్డిలోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరింది. దీంతో.. సెల్లార్లలో ఉంచిన బైకులు, కార్లు మునిగిపోయాయి. రెవెన్యూ కాలని, ల్యాండ్ అండ్ రికార్డ్స్ కాలనీపై తీవ్ర వరద ప్రభావం ఉంది.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ రికార్డు బద్దలు కొట్టింది. భారత్ ఇప్పటి వరకు 6 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలు సాధించింది. ఈ గేమ్స్‌లో భారత్ తొలిసారిగా 6 బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది.
ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయింది. బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చగా.. తాజాగా మూడో గండిని అధికారులు పూడ్చివేశారు. నాలుగు రోజులుగా గండ్ల పూడ్చివేత కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు చేస్తానన్న సాయం కోటి రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు.
ఏడో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూటా కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు
ఆంధ్రప్రదేశ్‌లోని బస్సు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగుబస్సు బోల్తా పడింది. నల్లమాడ నుంచి అనంతపురంకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి.
Balapur Ganesh Laddu: వినాయక చవితి.. ప్రపంచంలో హిందువులు ఏ ఖండంలో ఉన్నా చేసుకునే పెద్ద పండుగ. మన దేశంలో ప్రజలు సామూహికంగా మండపాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తిభావంతో జరుపుకునే పండుగ వినాయక చవితి. ప్రత్యేక రూపాల్లో చేసిన గణపతులు ఒక ఎత్తు అయితే.. లడ్డు వేలం పాట మరొక ఎత్తు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే ఈ శోభ పతాకస్థాయిలో ఉంటుంది. ఈ పండుగను మిగతా ప్రాంతాల్లో పోలిస్తే హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకుంటారు.