అమీన్పూర్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. అమీన్పూర్ వాణినగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో.. ఇవాళ కాటసానికి చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. మరోవైపు.. మల్లంపేట చెరువులో విల్లాలు నిర్మించిన విజయలక్ష్మిపై కూడా కేసు నమోదు అయింది. హైడ్రా కూల్చివేతలపై కాటసాని స్పందించారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చిన బల్డింగ్కు తనకు సంబంధం లేదన్నారు.
విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో.. కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని గోపాలపట్నంలో భారీ వర్షాలకు ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతుండటంతో ఇళ్లు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.
మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి.. మున్నేరు వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అండగా ఉంటాయని అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని, వరద బాధితులు కష్టాల్లో ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరద బాధితులను తప్పకుండా ఆదుకుంటుందన్నారు. క్షణాల్లో వచ్చిన భారీ వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని తెలిపారు. స్టేట్ డిజాస్టర్ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం. కలిసికట్టుగా…
జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. సొసైటీ సభ్యులకు భూమిని కేటాయించడం, వారికి ఇళ్ల స్థలాలు కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టు సంఘాన్ని ఆదుకునేందుకు, వారి శ్రేయస్సుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. సమాజంలో పాత్రికేయులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను ఆయన గుర్తించి, వారికి తగిన వనరులు మరియు సౌకర్యాలు కల్పించాల్సిన…
దులీప్ ట్రోఫీలో యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో ముషీర్ ఖాన్ సెంచరీతో అదరగొట్టగా, ఇప్పుడు బౌలింగ్ విభాగంలో ఆకాశ్ దీప్ చెలరేగాడు. తొలి మ్యాచ్లోనే ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇండియా బితో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీశాడు.
తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్తో నిర్వహించిన సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామన్నారు. 1988 కేంద్ర వాహన చట్టానికి.. సుప్రీం కోర్ట్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, రాష్ట్రంలో యాక్సిడెంట్స్ ను తగ్గించడానికి ప్రత్యేక నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఉద్యోగుల్లో అసహనం తొలగించడానికి పెండింగ్ సమస్యలు.. ప్రమోషన్స్ చేపడుతామని, చట్టాన్ని కఠినం…
హైడ్రా పై మాజీ మంత్రి సబితా ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్. మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్పా హైడ్రాకు ఏమి పని లేదంటూ తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కపూర్ టౌన్ షిఫ్ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సబితా, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ తొలగించడానికి…
భారతీయ రైల్వే త్వరలో 20 కోచ్ల వందే భారత్ రైలును తీసుకురానుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి కొన్ని నిర్దిష్ట మార్గాల్లో నడువనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న రద్దీ, పండుగల దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారత్లో క్రేజ్ పెరుగుతుండడం గమనార్హం.
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నంకి తూర్పున 280 కి.మీ., గోపాల్పూర్కి తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ.,పారాదీప్ కి దక్షిణ-ఆగ్నేయంగా 260 కి.మీ , దిఘాకి దక్షిణంగా 390 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.