ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి కొండన్న ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలోని పొలాల వద్ద పుట్టగొడుగుల కోసం వెళ్లిన నేపథ్యంలో పాము కరిచినట్లు సమాచారం.
కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వద్ద యువకుడి ప్రాణాలను ఓ పోలీసు అధికారి కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వరద నుంచి యువకుడిని గన్నవరం సీఐ శివప్రసాద్ రక్షించారు.
బెజవాడలో వరద తగ్గుముఖం పడుతోంది. బుడమేరు గండ్లు పూడ్చటంతో నగరంలో బుడమేరు వరద ఆగింది. బుడమేరు గండ్లు పూర్తిస్థాయిలో పూడ్చివేయడంతో పలు ప్రాంతాలు ముంపు నుంచి బయటపడుతున్నాయి. విజయవాడలోని కేఎల్ రావు నగర్, సాయిరాం సెంటర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈరోజు మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం భారీ ఎత్తున కురుస్తుండతో ఆందోళన మొదలైంది. ఎగువన కూడా బయ్యారం, గార్ల, మహబూబాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మున్నేరుకి వరద వస్తుంది. దీంతో.. మున్నేరు ముంపు బాధితులను మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా 'సి' వర్సెస్ ఇండియా 'డి' మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 'సి' నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. జట్టు గెలుపొందడంలో స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా సి తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 19.1 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా.. అందులో ఏడు మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ అవసరమని.. అలాంటి వాడైతేనే జట్టులోని ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ సమస్యలను పరిష్కరించగలడని డానిష్ కనేరియా తెలిపాడు. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత.. పాకిస్తాన్ టీంకు వైట్-బాల్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను, టెస్ట్ టీమ్ కోచ్‌గా జాసన్ గిల్లెస్పీని నియమించారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం దగ్గరకు వచ్చిన గవర్నర్ కు ఉత్సవ సమితి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత.. భారీ గణనాథుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు.