కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ , పంట పొలాలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) స్పోర్ట్స్ అకాడమీల్లో నిమగ్నమైన క్రీడా కోచ్‌ల సేవలను కొనసాగిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. తమ కోచ్‌లను ఆకస్మికంగా తొలగించడం వల్ల ప్రతికూలంగా ప్రభావితమైన విద్యార్థుల దుస్థితి సెప్టెంబర్ 6న ఈ కాలమ్‌లలో హైలైట్ చేయబడింది. సొసైటీ 28 క్రీడా అకాడమీలను నిర్వహిస్తోంది, గోల్ఫ్, క్రికెట్, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్ , జూడోతో సహా 12 విభాగాలను అందజేస్తూ 35 మంది కోచ్‌ల సేవలను గౌరవ వేతనం ఆధారంగా…
ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. బ్యారేజిలోని 67,69,70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల మరమ్మతులను పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీలుతో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్ కూడా ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం.. ఈ ఇద్దరికీ బెయిల్ మంజూరైంది.
Srisailam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తులకు విభూదిధారణను ఆలయ ఈవో పెద్దిరాజు పునఃప్రారంభించారు. ఆలయ క్యూలైన్ వద్ద ఆలయంలోనికి ప్రవేశించే భక్తులకు అధికారులు విభూదిధారణ చేస్తున్నారు.
వచ్చే నాలుగు వారాల్లోగా ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. పార్టీ ఫిరాయింపులపై ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తీర్పు ‘చెంపదెబ్బ’ అని ఆయన అభివర్ణించారు. కేటీఆర్ సోమవారం ఒక ప్రకటనలో, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రజాస్వామ్య…
కడప జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వియన్‌పల్లి మండలంలోని మొగమూరు వాగులో వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం ఈ తీర్పు పై పూర్తి అధ్యయనం చేయాల్సి ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పే తుది తీర్పు కాదు దీన్ని తుది తీర్పుగా భావించి ఉప ఎన్నికలు వస్తాయని కొన్ని పార్టీలు పండుగ చేసుకుంటున్నాయని, కానీ వారికి ఇంకా పైనా చాలా కోర్టులు ఉన్నాయన్న విషయం ఆ పార్టీ వాళ్లు విస్మరిస్తున్నారన్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై డబుల్ బెంచ్‌కి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకెళ్లొచ్చు ఇలా చాలా…
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మహీంద్రా థార్ కారులో వెళ్తూ గన్నవరం - కేశరపల్లి రూట్లో కారుతో సహా గల్లంతైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి.. సోమవారం బుడమేరులో శవమై తేలాడు.
బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం, హిందువులపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో.. హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. సరిహద్దుల్లో వేలాది మంది హిందువులను భద్రతా అధికారులు అడ్డుకున్నారు.