సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేసి.. పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వాటికి చేయూతను ఇస్తుందని సీఎం అన్నారు.
తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో.. తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో.. తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు.
ప్రెగ్నెన్సీ లేకుండానే 9 నెలలపాటు గర్భవతి అని మేనేజ్ చేయడం సాధ్యమా.. ఇది సినిమాల్లో సీరియల్స్ లోనే సాధ్యం అంటారా.. అయితే జనగామ జిల్లాలోని ఓ మహిళ నిజ జీవితంలోనూ … దీన్ని నిజం చేసింది… మహిళ ప్రెగ్నెన్సీ కాకుండానే.. 9 నెలల పాటు ఎక్కడ అనుమానం రాకుండా మేనేజ్ చేసి కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చింది.. నానా హంగామా సృష్టించి చివరికి పోలీస్ స్టేషన్ కు చేరింది జనగామ మాతా శిశు ఆస్పత్రిలో ఓ మహిళ…
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రేవంత్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ట మసక బారిందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చిన రూ.800 కోట్ల ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. రేవంత్ 9 నెలల పాలనలో 2 నెలల పెన్షన్ మింగేశారని హరీష్ రావు విమర్శించారు.…
బొట్టు పెట్టుకుని పూజలకే పరిమితమయ్యే వాళ్లు హిందువులు కాదని, హిందువులపై దాడిని అడ్డుకుంటూ హిందూ ధర్మ రక్షణకు పాటుపడేవాళ్లే నిజమైన హిందువులని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు సాయంత్రం బండి సంజయ్ ఖైరతాబాద్ బడా గణేశ్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర…
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మద్దూరులో కేంద్ర బృందాన్ని కలిసి రైతులకు జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్డీవో రాజు పాల్గొన్నారు. బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. వరద…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళా నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ శోభా రాణి మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి…చీరలు.. గాజులు వేసుకునే వాళ్ళు ఎవరూ చేతకాని వాళ్ళు కాదని విరుచుకుపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని, గాజులు పెట్టుకునే వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటే నీ ఇంట్లో బిడ్డా.. భార్య ఉందని ఆమె అన్నారు. మహిళలను అడ్డుపెట్టుకుని గెలిచిన చరిత్ర…
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా వరదకు ఎఫెక్ట్ అయ్యారు. పవన్ ఇంటి స్థలం ఏలేరు వరద ముంపుకు గురైంది. పిఠాపురం వై.జంక్షన్ వద్ద పవన్ కల్యాణ్ ఇంటి స్థలం నీట మునిగింది.