CS Neerabh Kumar Prasad: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
- రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
- ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CS Neerabh Kumar Prasad: ఈనెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని విజయవతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి సంబంధించి గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమం ఈనెల 17న ప్రారంభమై పక్షం రోజుల పాటు అనగా గాంధీ జయంతి అక్టోబరు 2 వరకూ నిర్వహించాలని చెప్పారు. ఇందుకు సంబంధించి సన్నాహక కార్యక్రమం ఈనెల14 నుండి ప్రారంభమవుతుందన్నారు. స్వచ్ఛతా హి సేవా ప్రచారం వివిధ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది పౌరులను సమీకరించడానికి రూపొందించబడిందని, ఈ ప్రచారం ప్రవర్తనలో భాగంగా స్వచ్ఛతను ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. రాబోయే స్వచ్ఛతా హి సేవ ప్రచారం 2024 కోసం సన్నాహకాలపై సీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలను ఈ నెల 17 నుంచి ప్రారంభించి పక్షం రోజుల పాటు నిర్వహించాలన్నారు.
Read Also: AP CM Chandrababu: సాధారణ విపత్తులా ఈ విపత్తును చూడకండి.. ఉదారంగా సాయం చేయండి..
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
17 సెప్టెంబర్ నుండి అన్ని జిల్లాలు, పట్టణ స్థానిక సంస్థలు క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ల (CTUలు) పరివర్తనను ప్రారంభించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల కేంద్రాల్లోను సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటై ప్రచారాన్ని పర్యవేక్షించడానికి ఒక నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని తెలిపారు. ప్రచార కార్యకలాపాలు, ఉత్తమ అభ్యాసాలను హైలైట్ చేయడానికి, పౌరులు, లబ్ధిదారుల వాయిస్‌లను విస్తరించడానికి జిల్లాలు, యూఎల్‌బీలు, రాష్ట్రంలో ప్రతిరోజు అప్‌డేట్‌లు, ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు, విజయాలను పోస్ట్ చేయడానికి నిరంతరం పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అన్ని శాఖలు ఈకార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా పౌరులను పెద్దఎత్తున భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత, పరిశుభ్రతను పెంపొందించడానికి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.అనంత రాము, అనిల్ కుమార్ సింఘాల్, ఎం.టి.కృష్ణ బాబు, ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, కాంతిలాల్ దండే, స్వచ్చాంధ్ర కార్పొరోషన్ ఎండీ గంధం చంద్రుడు, తదితర అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!