నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ భేటీ కానుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని పోరాట కమిటీ ఉపముఖ్యమంత్రిని కోరనుంది.
పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్‌కి పంపాలంటే భయమేస్తోందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా అంటూ ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మాత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామి సింహవాహనంపై మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఇదిలా ఉండగా.. రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రులలో కనకదుర్గమ్మ ఇవాళ 4వ రోజు శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారు.
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరారు. అయితే, జానీ మాస్టర్‌కు వచ్చిన అవార్డును రద్దు చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జాతీయ చలనచిత్ర అవార్డును రద్దు చేశారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేయడంతో, అవార్డు కమిటీ గౌరవాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెస్ట్ కొరియోగ్రఫీకి గాను…
జానపద సింగర్, రైటర్ మల్లిక్‌తేజ తనపై లైంగికదాడికి యత్నించాడని సహచర గాయని గత ఆదివారం జగిత్యాలలోని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజాకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లిక్ తేజ్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఫోక్ సింగర్ మల్లిక్ తేజా తరఫు న్యాయవాది లక్ష్మణ్ మాట్లాడుతూ..…
శివరామరాజు ఫేమ్ వెంకట్, ఈ సినిమాతో మాస్ హీరోగా అవతారమెత్తుతున్నాడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శనివారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేశారు. నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ చిత్రానికి ఇంత స్థాయికి రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్లూ పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా…
జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. చాలా రోజులు ఈ సమస్యలు ఉంటే అది పైల్స్‌కు కారణమవుతుంది. కడుపు శుభ్రం చేయకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది.
కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత…