హైడ్రాపేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవ విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైడ్రా పేరు మీద ప్రతిపక్షాలు కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం పై చేస్తున్న నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, మూసీ రిజర్వేషన్ పై సీఎం, ప్రభుత్వం కార్యక్రమంపై అపోహలు సృష్టించి… పాలనపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాది ప్రజా, పారదర్శక ప్రభుత్వమని, ప్రజా ఎజెండానే కానీ వ్యక్తిగత ఎజెండా మాకు లేదని ఆయన వెల్లడించారు. రాక్స్, లేక్స్, పార్క్స్ ఉంటేనే నగరం అని, హైదరాబాద్ వీటన్నింటికి ప్రసిద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు రాక్స్, లేక్స్, పార్క్స్ శోభను తీసుకు వచ్చాయని, కాలక్రమంలో రాక్స్ లేకుండా పోతున్నాయి. పార్క్స్ కబ్జాలకు గురవుతున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. లేక్స్ కూడా లేకుండా మాయం అయి నగరానికి పెను ప్రమాదంగా మారుతున్నాయని, ఆకస్మిక వరదలు, వర్షాలు నేపద్యంలో గత ప్రభుత్వాలు కొంత పని చేసాయని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.
Kolkata Doctor Case: ట్రైనీ వైద్యురాలి కేసులో సీబీఐ ఛార్జిషీట్ .. కీలక విషయం వెల్లడి..
అంతేకాకుండా.. ‘ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. మూసీ సుందరికరణ విషయంలో ఎవరికి వ్యక్తిగత ఎజెండాలు లేవు. 2014 కంటే ముందు హైదరాబాద్ పరిధిలో ఎన్ని చెరువు ఉన్నాయి, 2023,24 వరకు ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఎన్ని మాయం అయ్యాయి వివరాలు మా డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. సాటిలైట్ మ్యాప్స్ ద్వారా హైదరాబాద్ లో చెరువుల పరిస్థితిని చూపిస్తున్న అధికారులు, హైదరాబాద్ 920 చెరువులు ఉంటే 20 పార్కులు పూర్తిగా కబ్జాకు గురైయ్యాయి. చెరువులను కాపాడుకోలేక పోతే రాబోయే రోజుల్లో చెరువులు ఉండవు. ఇప్పుడు చూపించిన చెరువుల సాటిలైట్ మ్యాప్స్ FTL పరిధిని మాత్రమే చూపించాం. చెరువులో కట్టిన ఇల్లు కూల్చాలనే తపన లేదు. చెరువులను కాపాడు కోవాలనే తపన ఉంది. అందరి కోసం ఆలోచన చెరువుల పరిరక్షణ. చాలా బాధతప్త హృదయంతో చెబుతున్నా. మూసీ కూడా చాలా కబ్జాకు గురైంది. నదీ పరీవాహక ప్రాంతంలోనే నగరాలు వచ్చాయి. నదులను డ్రైనేజీలు గా మార్చి అక్కడ ఎవరూ నివసించలేని పరిస్థితి. లండన్ నగరంలో థేన్స్ నది నగరం మధ్యలో నుంచి వెళ్తుంది. జపాన్ లో ఒసాకా నది ఉంది. ఆ నగరానికి మణిహారంగా మార్చారు. టోక్యోలో సుమిధ నది ఉంది. ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారిని ఏమి చేయాలో ఆలోచన చేస్తాం. ఎవర్ని నష్టపరిచే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు.. చేయబోదు. మనది గ్లోబల్ సిటీనే. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది.
మూసీ భాదితులందరితో మాట్లాడటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తలుపులు తెరిచే ఉన్నాయ్. ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. మీలాగా గడిలో లేము. స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను చూసి అక్కడే భాదితుము ఇండ్లు కట్టించే ఆలోచన చేస్తున్నాం. మీకు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం ఇష్టం లేకపోతే చెప్పండి. బఫర్ జోన్ జోలికి వెళ్లడం లేదు. FTLను కాపాడాలని చూస్తున్నాం. గాంధీనగర్ లో సబర్మతిని సుందరికరణ చేయలేదా? ఇక్కడ మూసీ సుందరికరణ పై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఇల్లు కట్టుకోవడం ఎంత విలువైందో మాకు తెలుసు. అంతకంటే విలువైన ఇండ్లు కట్టి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎవరు ఏ సూచనలు, సలహాలు ఇచ్చిన ప్రజలకు మెరుగైనవి అనుకుంటే స్వీకరిస్తాం. మీరు సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే బాధ్యత లేని ప్రతిపక్షంగా భావించాల్సి వస్తుంది. ముమ్మాటికీ చెరువులు రక్షిస్తాం.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Pakistan Cricket: ఈ బంగ్లా జట్టు పైనా ఓడింది.. పాక్‌ను ఏమనాలో కూడా తెలియడం లేదు!