రోజు రోజుకు కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయాల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు జేబులకు చిల్లుపడుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కూరగాయాల ధరలు ఆకాశానంటుతున్నాయి. పండుగ వేళ కావడంతో మార్కెట్లలో పూల ధరలు సైతం పెరిగిపోయాయి. అయితే.. దేవి నవరాత్రోత్సవాల ఉండటంతో శాఖాహార ప్రియులు కూరగాయలు కొనడం తప్పదనే చెప్పాలి. అయితే.. ముఖ్యంగా కూరగాయాల్లో టమాటో ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటో ధర…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. ‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని నేను. హైడ్రాసంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. చెరువు కన్నతల్లి లాంటిది. కానీ హైదరాబాద్ లో ఉన్న ఏ చెరువు…
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. 128 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 49 బంతులు ఉండగానే చేధించింది. 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రైల్వే ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. భారతీయ రైల్వేలు ప్రైవేటీకరించబడదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరికీ సరసమైన సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. ఇటీవల, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఫౌండేషన్ డే కార్యక్రమంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వే భవిష్యత్తు గురించి చాలా పెద్ద విషయాలు చెప్పారు. రూ.400లోపు ప్రజలు 1000 కిలోమీటర్ల వరకు హాయిగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాబోయే ఐదేళ్లలో రైల్వేలో పూర్తిస్థాయి పరివర్తన ఉంటుందని..…
దండకారణ్యంలో కీలక ప్రాంతమైన శ్రేయస్కరమైన ప్రాంతం కాదా అంటే అవుననే అనిపిస్తుంది వేల కిలోమీటర్ల మేరకు దండకారణ్యంతో పెద్దపెద్ద గుట్టలతో అందమైన సెలయేర్లతో నిండి ఉన్న ABOOJMAD లో ఇప్పుడు మావోయిస్టులకి రక్షణ లేకుండా పోయింది. తమకు రక్షణ కేంద్రాలను కున్న అటవీ ప్రాంతాలు పై భద్రతా బలగాలు రోజూ రోజు పట్టు సాధి స్తున్నాయి. ఇంద్రావతి నది సరిహద్దులో 31 మంది మావోయిస్టుల మృతి వెనక ఏమి జరిగింది .వారిని ఎలా ముట్టు పెట్టారు. ఎన్టీవీ…
భారత్-బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. దీంతో భారత్ ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
తెలంగాణలోని ప్రముఖ పూల పండుగ బతుకమ్మను అరేబియా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడుతుండటంతో జెడ్డా వ్యాప్తంగా తెలంగాణ ప్రవాసాంధ్రులలో సంబరా వాతావరణం నెలకొంది. బతుకమ్మ సంబరాలను నిర్వహించడంలో గల్ఫ్ ప్రాంతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుంది. గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (జిడబ్ల్యుసిఎ) ఆధ్వర్యంలో దుబాయ్‌లోని వివిధ సంస్థలు శని, ఆదివారాల్లో ఈ వేడుకను జరుపుకోవడానికి పోటీ పడుతున్నాయి. జువ్వాడి శ్రీనివాస్‌రావు, సలావుద్దీన్, శామ్యూల్,…
రుషికొండ పై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ నిర్మాణాలు చాలా పెద్దవి.. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండ కట్టడాలు అవినీతి సామ్రాజ్యానికి సూచికగా మ్యూజియం ఏర్పాటు చేయలేమోనని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ నగరం వివిధ మతాలకు, సంస్కృతులకు ప్రతీకగా ఉంది. కానీ, ఇటీవలి కాలంలో పాశ్చాత్య సంస్కృతితో కలుషితం అవుతోంది. ఢిల్లీ, ముంబైలకు పరిమితమైన పబ్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తోంది. వీకెండ్లో నగర యువత పబ్‌లలో నింగి తాకుతూ, మద్యం సేవించి, అర్థనగ్న డాన్సులకు రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, పబ్ నిర్వాహకులు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలతో డాన్సు షోలు ఏర్పాటు చేసి, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం జరుగుతోంది. కొంతకాలం క్రితం కేబీఆర్ పార్క్…