ఇండియా ఉమెన్స్ టీమ్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి మహిళల టీ20 ప్రపంచకప్ 2024 పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే పాకిస్థాన్‌పై విజయం సాధించినా.. టీమిండియాకు సెమీస్ మార్గం అంత సులువు కాదు. టీమిండియా తదుపరి రెండు మ్యాచ్‌లు ఆసియా ఛాంపియన్ శ్రీలంక, డిఫెండింగ్ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరగనున్నాయి. సెమీఫైనల్‌కు చేరాలంటే భారత్‌కు ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ముఖ్యం. ఇక్కడి నుంచి మరో మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
PCB Chairman: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా..? పీసీబీ చీఫ్ సమాధానం ఇదే
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌పై భారత్ భారీ నెట్ రన్ రేట్‌పై ఓడింది. దీంతో.. తర్వాత రెండు మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్ పై ఓటమి తర్వాత భారత్ నెట్ రన్ రేట్ -2.900. ఈ క్రమంలో.. భారత్ పాక్‌పై భారీ తేడాతో మ్యాచ్‌ను గెలిచుంటే.. టీమిండియాకు అవకాశం లభించేది. కానీ.. ఈ మ్యాచ్‌ను త్వరగా ఛేజింగ్ చేయకపోవడంతో నెట్ రన్ రేట్‌ను మెరుగుపడలేదు.
Adani Group’s Stocks: షేర్ మార్కెట్లు మరోసారి కుదేలు.. అదానీ గ్రూప్ షేర్లు పతనం..!
స్మృతి మంధాన తొందరగా ఔటైన తర్వాత.. షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ చివర్లో ఖచ్చితంగా వచ్చి 24 బంతుల్లో 29 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. కానీ అప్పటికి చాలా ఆలస్యమైంది. 106 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలో.. టీమిడియా తన నెట్ రన్ రేట్ ను మెరుగుపరచుకోలేకపోయింది. పాకిస్థాన్‌పై విజయం తర్వాత.. భారత్ నెట్ రన్ రేట్ -1.217 ఉంది. గ్రూప్ A పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ తర్వాత భారత్ నాల్గవ స్థానంలో ఉంది. శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా.. నెట్ రన్ రేట్ వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియా నెట్ రన్ రేట్ చూస్తుంటే భారత్ తదుపరి రౌండ్ కు చేరుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో భారత్ తదుపరి రెండు మ్యాచ్‌లు గెలవడం తప్ప మరో మార్గం లేదు.