ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా తదితరులపై భూ మోసం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జలంధర్, లూథియానా, గురుగ్రామ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని లూథియానాలోని సంజీవ్ అరోరా నివాసం, హర్యానాలోని గురుగ్రామ్‌తో సహా దాదాపు 16-17 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడికి బీజేపీయే కారణమని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Also: Pakistan Cricket: ఈ బంగ్లా జట్టు పైనా ఓడింది.. పాక్‌ను ఏమనాలో కూడా తెలియడం లేదు!
ప్రధాని మోడీకి మందు దొరకని వ్యాధి ఉందని ఆరోపించారు. ప్రధాని ‘ద్వేషపూరిత వ్యాధి’ అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారని.. దీనికి వైద్యం లేదన్నారు. ప్రతి ఉదయం ఆప్‌ను నాశనం చేయడం, పార్టీ నాయకులను తొలగించడం, అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించడం.. అతనిని రాజకీయాల నుంచి తొలగించడం ప్రధానమంత్రి పని అని విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ఆరు నెలల పాటు జైల్లో ఉంచారని.. ఆయన ఇంట్లో మీకు ఏమైనా దొరికిందా అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. మీకు ఇంత ద్వేషం ఉంటే ఈ దేశం కోసం ఏం చేస్తావు అని సంజయ్ సింగ్ ప్రశ్నించారు..?.
Read Also: Pithapuram: పిఠాపురంలో ఆసక్తికరణ పరిణామాలు.. మళ్లీ జనసేన వర్సెస్ టీడీపీ..!
అంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈడీ దాడులకు సంబంధించి బీజేపీ, ప్రధాని మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని.. అరవింద్ కేజ్రీవాల్‌ను తమ నాయకులను అంతమొందించాలనే లక్ష్యంతో ఈరోజు మరోసారి ఈడీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా ఇంటిపై దాడి చేసిందని అన్నారు. ఈ దాడి అవినీతి వల్ల జరగలేదని.. సంజీవ్ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు కావడం వల్లే జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేని మోడీ ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు